విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండల పరిధిలోని దాచారం గ్రామంలో విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.అశోక్ కుమార్ మాట్లాడుతూ వానాకాలంలో వరి,పత్తి, కందులు ఇతర పంటలు సాగు చేయుటకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.

రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన సంచి మీద కంపెనీ పేరు, విత్తనరకం, బ్యాచ్ నెంబర్,లాట్ నెంబర్,రేటు ఉన్నదో పరిశీలించాలన్నారు.

విత్తనం కొనుగోలు చేశాక రైతు తప్పకుండా బిల్ రశీదు తీసుకొని,అది పంట కాలం అయిపోయే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.

గ్రామంలో లూజు విత్తనాలు,తక్కువ, ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మే వారెవరైనా వస్తే రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు ముంత పరమేష్,సురేష్, బి.మహేష్,సుధాకర్ రెడ్డి, నాగరాజు,రవి,మాధవరెడ్డి,నర్సయ్య,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

విజయ్, త్రిష మధ్య ఏదో నడుస్తోందా.. సోషల్ మీడియా వైరల్ వార్తల్లో నిజమెంత?