సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

వేములవాడ :వేములవాడ రూరల్ మండల పరిధిలో సైబర్ నేరాల గురించి అవగాహనా కార్యక్రమం సైబర్ జాగరుక్తా దివస్ ను నూకలమర్రి గ్రామంలోని తండాలో ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

వివరాలలోకి వెళితే ప్రతీ నెల మొదటి బుధవారం సైబర్ నేరాల గురించి ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించాలి అని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ సూచన మేరకు నిర్వహించడం జరిగింది.

ఇందులో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బెట్టింగ్ ఫ్రాడ్, సెక్స్ టార్షన్, లోన్ ఆప్ల గురించి వివరించటం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూసైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, లోన్, లాటరి పేరుతో వచ్చే మెసేజ్ లు కానీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి ఆశపడి మోసపోకండి అని, ఒకవేళ ఏదైనా సైబర్ మోసం కి సంబందించి ఎన్ సి ఆర్ పిలో ఫిర్యాదు చేసిన లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి, ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ఫోన్లు కనీస అవసరాలయ్యాయి.

బ్యాంకు ఖాతాలతో ఫోన్ నంబర్లు అనుసంధానం కావడంతో యాప్ లు డౌన్లోడ్ చేసుకుని చాలామంది నగదు రహిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు.

ఓ వైపు డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తుండగా అంతే వేగంగా మరోవైపు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.

మొబైల్లో ఆటలు ఆడే సందర్భంలో, వివిధ రకాల సైట్లలో మనకు అవసరమైన వస్తువులు అతితక్కువ ధరకు లభిస్తాయని వచ్చే ప్రకటనలకు ఆకర్షితులైన వారు వెంటనే ఆ లింకు లపై క్లిక్ చేస్తున్నారు, దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

తక్షణమే ఆ మొబైల్ నంబరుకు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరగాళ్ల పరమవుతోంది.

విషయం తెలుసుకునే సరికి సొమ్ము ఖాళీ కావడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి.

వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని ఎస్ ఐ మండల ప్రజలను కోరారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ…డైరెక్టర్ ఎవరంటే..?