సైబర్ నేరాలు, గంజాయి మీద యువతకు అవగాహనా

రాజన్నా సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో రేపాక గ్రామంలో ఎస్ పి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట ఎస్ఐ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మరియు గంజాయి వాడకం అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సదస్సుకు అతిధిగా వచ్చిన సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలయ్య మాట్లాడుతూ యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో గంజాయి వంటి చెడు వ్యాసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురవుతారు.

యువతే కాదు ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో మోసానికి గురి అవుతున్నారని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది ఎవరైనా అనుమానస్పదంగా తారసా పడినట్లయితే డయాల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేసారు ఈ అవగాహనా సదస్సులో గ్రామస్తులు,వివిధ సంఘ నాయకులు, యువతి యువకులు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్