‘నాటు నాటు..’ పాటతో జైపూర్ పోలీసుల అవగాహన..!

దర్శకుడు రాజమౌళి నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.ప్రపంచ వ్యాప్తంగా కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు.’ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ పాటను జైపూర్ పోలీసులు అవగాహన కల్పించేందుకు వినూత్నంగా వినియోగిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగించారు.పాటలో రాంచరణ్, ఎన్టీఆర్ స్టెప్పులేస్తున్న ఫొటోపై సే నోటు నోటు నోటు నోటు డ్రింకింగ్ వైల్ డ్రైవింగ్ అంటూ రాసుకొచ్చారు.

ఈ క్రమంలో ఫొటోను జైపూర్ పోలీసులు షేర్ చేశారు.ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ విజయవానికి సంకేతంగా గ్లాస్ పైకెత్తి చీర్స్ చెప్పండి.

కానీ ఆ గ్లాసు మన కారులో ఉండకుండా చూసుకోండి.మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమనే క్యాప్షన్ జోడించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సింగపూర్ ప్రతిపక్ష పార్టీకి సెక్రటరీ జనరల్‌గా భారత సంతతి నేత ..!!