బాలల లైంగిక వేధింపులపై అవగాహన :

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల లైంగిక వేధింపులపై రుద్రాంగి మండలం( Rudrangi Mandal )లోని మానాల జడ్పిహెచ్ఎస్, కృష్ణవేణి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలలో , కేజీబీవీ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రుద్రంగి పోలీస్ పోలీసు స్టేషన్ ఎస్సై ఎస్.అశోక్ హాజరై మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల హక్కులు, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది.

అదేవిధంగా ఎవరైనా అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తే 100, 1098 కు సమాచారం ఇవ్వాలని పేర్కొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఐ సి పి ఎస్ విజయ్ కుమార్, ఐసిపిఎస్ సంపత్ కుమార్ , విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

నలుపుదనం పోయి చర్మం తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!