పోస్టల్ పథకాలపై దుమాల లో అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై గ్రామ ప్రజలకుతపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ మెయిల్ ఓవెర్సెర్ సాయిరాం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.ప్రతి ఇంటికి తపాలా బీమా అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు .

ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ కార్యదర్శి మహేందర్ , మాజీ సర్పంచ్ కదిరె శ్రీనివాస్ తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్ రాజు , కిషన్ దాసుపేట సబ్ పోస్ట్ మాస్టర్ మాలోతు రాజు , దుమాల గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సతీష్ తో పాటు పలువురు తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

ఏంటి లాస్య చివరికి ఇలా అయిపోయావు? ఫొటోస్ వైరల్