Bathing : స్నానం చేసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి..!
TeluguStop.com
చాలామంది ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండరు.వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించినది కూడా వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా వాళ్ళ దగ్గర సంతోషం మాత్రం ఉండదు.
ఎంత కష్టపడినా అనుకున్నది మాత్రం సాధించలేరు.దానికి కారణం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ( Negative Energy ) అని అంటున్నారు మన వాస్తు పండితులు.
చుట్టూ ఇలాంటి పరిస్థితి ఉన్నంత సేపు అనుకున్న పనులు అస్సలు జరగవు.ఇలాంటివి పోవాలంటే వాస్తు శాస్త్రం( Vastu Shastram ) ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఇల్లు సంతోషంగా ఉండాలంటే స్నానం( Bathing ) చేసిన తర్వాత ఈ పనులు తప్పనిసరిగా చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు సైతం చెబుతున్నారు.
అయితే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా ఉండాలి. """/" /
ఇందులో భాగంగానే స్నానం తప్పనిసరిగా చేయాలి.
స్నానం చేయడం వలన శరీరంలోని ఎన్నో అవయవాలు కదిలి ఆరోగ్యంగా ఉంటారు.ఇదే సమయంలో చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంకరంగా మారుతుంది.
అయితే స్నానం చేసిన తర్వాత చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సిందే.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.స్నానం చేసినా వెంటనే పసుపుని( Turmeric ) ఇంట్లో చల్లుకోవాలి.
ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్లిపోతుంది.
ఆపైగా పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేయడం వలన వాతావరణంలో కానీ ఇంటి నేలపై కానీ ఎలాంటి కలుషితం లేదా క్రిములు ఉన్నా కూడా శుభ్రం అవుతుంది.
"""/" /
అలాగే స్నానం చేసిన తర్వాత ఉప్పు నీళ్లు( Salt Water ) చల్లుకోవాలి.
ఉప్పు నీళ్లతో కూడా చెడు వాతావరణాలు శుభ్రం అవుతాయి.పైగా ఉప్పులో ఉండే లక్షణాలు కూడా చెడు దృష్టిని ఇంటి పై పడకుండా చేస్తాయి.
స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపాలు వెలిగించి ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లుకోవాలి.
గంగాజలం ప్రకృతి నుండి లభించింది.వీటిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి.
కాబట్టి వీటిని ఇంట్లో చల్లుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది.ముఖ్యంగా ఇంటి ముఖ ద్వారం దగ్గర చల్లడం వలన ఎలాంటి చెడు వాతావరణం కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
కాబట్టి స్నానం చేసిన తర్వాత ఈ నియమాలన్నీ పాటిస్తే మీ ఇల్లు సంతోషకరంగా ఉంటుంది.
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..