తరచూ తలనొప్పి వేధిస్తుందా.. అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే!

తలనొప్పి.సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

దాదాపు ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో తలనొప్పి సమస్యతో బాధపడే ఉంటారు.

అయితే అప్పుడప్పుడు తలనొప్పి వస్తే ఇబ్బంది ఏమి ఉండదు.కానీ కొందరు తరచూ తలనొప్పితో( Headache ) ఎంతగానో సతమతమవుతుంటారు.

రోజుకు కనీసం ఒక్కసారైనా తలనొప్పి వస్తుంటుంది.దాంతో చేసే పనిపై దృష్టి సారించలేకపోతుంటారు.

తోటి వారిపై తెలియకుండానే ఎక్కువగా చిరాకు పడుతుంటారు.అలాగే పెయిన్ కిల్లర్స్( Pain Killers ) ను కూడా అధికంగా వినియోగిస్తుంటారు.

అయితే ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తరచూ తలనొప్పి రావడానికి మనం రోజువారీ తీసుకునే ఆహారాలు కూడా కారణం అవుతుంటాయి.

అవేంటో తెలుసుకుని వాటిని దూరం పెడితే తలనొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం త‌ల‌నొప్పికి కార‌ణం అయ్యే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / సాధారణంగా కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.భోజనం చేశామంటే ఖచ్చితంగా ఏదో ఇక నాన్ వెజ్ ఉండాల్సిందే.

అయితే రెగ్యులర్ గా నాన్ వెజ్ తినడం వల్ల తలనొప్పి విపరీతంగా వేధిస్తుంటుంది.

కాబట్టి తరచూ తల నొప్పితో బాధపడేవారు రెగ్యులర్ గా నాన్ వెజ్ తీసుకోవడం మానుకోండి.

తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది కాఫీ తాగుతుంటారు.కాఫీ( Coffee ) త‌ల‌నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుందని భావిస్తుంటారు.

అయితే కాఫీ అధికంగా తాగడం వల్ల కూడా తలనొప్పి ఇబ్బంది పెడుతుంది.కాబట్టి నిత్యం తల నొప్పితో బాధపడేవారు కాఫీని అవాయిడ్ చేయడం మంచిది.

"""/" / అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు రిలీఫ్ కోసం కొందరు చ‌ల్ల‌గా ఉండే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ( Ice Creams, Cool Drinks )వంటివి తీసుకుంటారు.

వీటివల్ల రిలీఫ్‌ కాదు తలనొప్పి ఇంకా పెరుగుతుంది.చాక్లెట్స్.

వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కానీ అతిగా చాక్లెట్స్ ను తింటే మాత్రం తలనొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

తరచూ తల నొప్పితో బాధపడేవారు చాక్లెట్స్ ను చాలా లిమిట్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పరారీలో సినీ నటి కస్తూరి శంకర్… గాలిస్తున్న పోలీసులు?