Summer Diet : ఎండాకాలంలో ఇవి తింటే మాత్రం చాలా ప్రమాదకరం..!

ఎండాకాలం( Summer Season ) వచ్చేసింది.బయటికి వెళ్తే ఏ వయసు వారికి అయిన ఈ ఎండ వలన ఎంతో నీరసం అవుతుంది.

అయితే నీరసం అవుతుంది అని కొంతమంది ఏది పడితే అది తింటూ ఉంటారు.

కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా తక్కువగా తినాలి.ఆహార పదార్థాలు నోరూరించిన వీలైనంతవరకు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

లేదంటే కడుపుబ్బరంతో పాటు అజీర్ణం లాంటి సమస్యలు ఎదురవుతాయి.ఎండలు పెరిగే కొద్ది రోజు తీసుకునే ఆహారంలో కారం, మసాలాలు చాలా వరకు తగ్గించాలి.

ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియలను మందగించేలా చేస్తాయి. """/"/ అంతేకాకుండా చికెన్, మటన్ లాంటిది తింటే ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యలను పెంచుతాయి.

అంతేకాకుండా అరుగుదల మందగించడం విరేచనాలు( Motions ), మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.

మరి ముఖ్యంగా వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది.ఎంత మందికి ఎంత నీళ్ళు ఎక్కువగా తీసుకున్న కూడా డిహైడ్రేషన్ సమస్య( Dehydration ) తప్పడం లేదంటే కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారని అర్థం.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది.దీంతో డిహైడ్రేషన్ కు దారితీస్తుంది.

"""/"/ శరీరం కూడా తేమ కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది.ఇక ఈ కాలంలో వేపుళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్( Chips ) లాంటి వాటిని తీసుకుంటే చాలా ప్రమాదకరం.

ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు.వెళ్తే మాత్రం వికారం, అతిగా దాహం వేయడం తప్పదు.

కాబట్టి వేసవికాలంలో వీటన్నిటికీ దూరంగా ఉంటూ శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను ఉపయోగించాలి.అంతేకాకుండా శరీరానికి తగినంత నీళ్లు( Water ) తరుచుగా తీసుకుంటూ ఉండాలి.

ఆ క్షణంలో నా భార్యను చూసి ఏడ్చేశాను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!