రాత్రుళ్లు కంటి నిండా నిద్రపోవాలి అనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

ఆరోగ్యమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే నిద్ర ఎంతో అవసరం.కంటి నిండా నిద్ర ఉంటే సగానికి పైగా రోగాలకు మనం దూరంగా ఉండవచ్చు.

కాబట్టి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.అయితే కొందరికి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.

నాణ్యమైన నిద్రను పొందలేకపోవడానికి ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం.ముఖ్యంగా రాత్రుళ్లు కంటి నిండా నిద్రపోవాలి అనుకునే వారు తప్పకుండా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రివేళ ఆమ్ల ఆహారాలు అంటే టమోటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, సిట్రస్ పండ్లు ( Tomatoes, Onions, Garlic, Citrus Fruits )తిన‌కూడ‌దు.

ఇవి గుండెల్లో మంటను ప్రేరేపిస్తాయి.నిద్ర‌ను పాడు చేస్తాయి.

అలాగే నైట్ టైమ్ మాంసాహారం తీసుకోవ‌డం చెత్త ఎంపిక అవుతుంది.మాంసం జీర్ణం కావ‌డానికి చాలా స‌మ‌యం మ‌రియు శ‌క్తి అవ‌స‌రం అవుతుంది.

పైగా మాంసాహారంలో వాడే మ‌సాలాలు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.ఇది నిద్రను కష్టతరం చేస్తుంది.

"""/" / కొంత‌మంది నైట్ టైమ్ కాఫీ తాగుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే క‌చ్చితంగా ఆ అల‌వాటును మానుకోండి.రాత్రిపూట కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ కంటెంట్ నిద్ర హార్మోన్ల‌ను ప్ర‌భావితం చేస్తుంది.

మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.అలాగే రాత్రివేళ కీర‌దోస‌కాయ‌, పుచ్చ‌కాయ‌, నిమ్మ‌కాయ‌, టమాటా( Cucumber, Watermelon, Lemon, Tomato ) త‌దిత‌ర వాట‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి.

ఇవి త‌ర‌చూ బాత్రూమ్ ఉప‌యోగించ‌డానికి కార‌ణం అవుతాయి. """/" / ఆల్కహాల్ మీ నిద్ర చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది మరియు నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.

కాబ‌ట్టి నైట్ టైమ్ ఆల్క‌హాల్ తీసుకోరాదు.అంతేకాకుండా అధిక కొవ్వు పదార్ధాలు, స్పైసీ ఫుడ్స్, చక్కెర ఆహారాలు, ఐస్ క్రీమ్స్‌, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాల‌ను కూడా రాత్రివేళ తీసుకోరాదు.

ఇవి జీర్ణ స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయి.అదే స‌మ‌యంలో మీ నిద్ర నాణ్య‌త‌ను దెబ్బ తీస్తాయి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..