మంగళవారం కుజునికి అత్యంత ప్రీతికరమైన రోజు.కుజ ప్రభావం మంగళవారం అధికంగా ఉంటుంది.
కుజుడికి కోపం, కలహాలు కల స్వభావం కలవాడు.అందుకే మంగళవారం ఎలాంటి శుభకార్యం తలపెట్టినా గొడవలు జరగడానికి ఆస్కారం వుంటుంది.
అందువల్ల శుభకార్యాలు ఏవీ కూడా మంగళవారం చేయకూడదు.అలాగే అప్పుగా ఇతరులకు మంగళవారం డబ్బులను కూడా ఇవ్వకూడదు.
అలా డబ్బు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇస్తే పొరపాటున అవి తిరిగి రావని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఎవరి దగ్గర నుంచైనా అప్పుగా డబ్బులు తీసుకోవడం వల్ల అది అనుకున్న పనులకు కాకుండా ఇతర పనులకు ఖర్చవడంతో పాటు అది అనేక బాధలకు కారణం అవుతుంది.
మంగళవారం ఇతరులకు డబ్బులు ఇవ్వడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటి నుంచి బయటకు పంపినట్టు.
అలాగే మంగళవారం ఇంట్లో బూజులు దులపకూడదు.అలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు.అలాగే కొత్త దుస్తులు ధరించకూడదు.
మంగళవారం రోజున కుజ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దూర ప్రయాణాలు మంచిది కాదు.
తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఒక వెల్లుల్లి రెబ్బను వెంట తీసుకొని ప్రయాణం చేయాలి.
మంగళవారం ఉపవాస దీక్షలు చేసే వారు రాత్రి పూట ఉప్పు లేని ఆహారం తీసుకోవాలి.
మంగళవారం ఎవరికి ఉప్పు దానం చేయ రాదు.అలాగే గోళ్ళు కత్తిరించడం, క్షవరం తీయడం వంటి పనులు చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు కలహాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
కుజ దోషమున్నవారు కుజగ్రహానికి పూజించడం ద్వారా దోషము తొలగి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
కుజుడుకు ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి.మంగళవారం రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
మహిళలైతే ఎరుపు రంగు పువ్వులను పెట్టుకోవడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.మంగళవారం అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.