రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే ఈ రెండిటితో ఈజీగా వదిలించుకోండి!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది రక్తహీనత సమస్యతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.

రక్తహీనతను నిర్లక్ష్యం చేసే కొద్ది ఆరోగ్యానికి ముప్పు పెరుగుతూ ఉంటుంది.ముఖ్యంగా రక్తహీనత వల్ల నీరసం అలసట విపరీతంగా పెరిగి పోతాయి.

బరువు పెరగడం లేదా తగ్గడం, ఏ పని చేయలేక పోవడం, చీటికి మాటికి చిరాకు, సంతాన లోపం తదితర సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి.

అందుకే వీలైనంత త్వరగా రక్తహీనతను వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు బీట్ రూట్ మరియు అంజీర్‌ అద్భుతంగా సహాయపడతాయి.

ఈ రెండిటితో సులభంగా రక్త హీనతను వదిలించుకోవచ్చు.అదెలాగో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బీట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే పండిన ఒక అంజీర్ ను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, అంజీర్ పండు ముక్క‌లు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్‌ వాటర్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. """/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రుచికి సరిపడా తేనెను కలిపి సేవించాలి.ఈ బీట్ రూట్ అంజీర్‌ జ్యూస్ రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజూ తీసుకుంటే అందులో ఉండే పోషక విలువలు రక్తహీనత సమస్యను చాలా త్వరగా నివారిస్తాయి.

అలాగే రక్తహీనత లక్షణాల‌ను సైతం తరిమి కొడతాయి.కాబట్టి ఎవరైతే రక్తహీనత సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ బీట్ రూట్ అంజీర్ జ్యూస్‌ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

ఫేషియ‌ల్ హెయిర్ ను రిమూవ్ చేసే న్యాచుర‌ల్ రెమెడీస్ ఇవే!