మళ్ళీ రాజ్ తరుణ్ కి ఓటేసిన చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ఫేమస్ అయిన అవికా గోర్ తర్వతా ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది.

మళ్ళీ రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామా అంటూ సందడి చేసిన ఈ పిల్ల మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక టాలీవుడ్ లో యువ హీరోలకి బెస్ట్ ఛాయస్ గా మారిపోయిన ఈ భామ ఊహించని విధంగా లావు అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

అదే టైంలో వ్యక్తిగత కారణాలతో కొంత కాలం సినిమాలకి దూరం అయ్యింది.ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అవికా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.

అది కూడా తన బెస్ట్ పెయిర్ రాజ్ తరుణ్ తోనే కావడం విశేషం దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమాకి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ మధ్యా కాస్తా లుక్ మార్చి హాట్ గా తయారైన అవికా గోర్ ని తెలుగు ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

దిశా కేసులో సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై టీఎస్ హైకోర్టు స్టే