హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు వాళ్ళకి సుపరిచితం అయిన అవికా గొర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది.

తరువాత తన మొదటి సినిమా హీరో రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ ద్వారా సూపర్ హిట్ కొట్టిన ఈ భామ టాలీవుడ్ లో దూసుకుపోవడం గ్యారెంటీ అని అందరు అనుకున్నారు.

అయితే ఊహించని విధంగా లవైపోవడంతో ఈ భామకి అవకాశాలు తగ్గిపోయాయి.తరువాత హిందీలో హిస్టోరికల్ నేపధ్యంలో నడిచే సీరియల్ లో నటించిన అవికా గోర్ తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టింది.

రాజు గారి గది 3 సినిమాలతో టాలీవుడ్ లోకి మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అవికాకి ఈ సినిమా పెద్దగా కలిసిరాలేదు.

ఇక ఇప్పటి వరకు ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అవికా గోర్ లో గ్లామర్ ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే పాత్ర డిమాండ్ చేస్తే తాను గ్లామర్ గా కూడా కనిపించడానికి రెడీ అని ఆ మధ్య ఈ భామ సంకేతాలు ఇచ్చింది.

దానికి తగ్గట్లుగానే తాజాగా అదిరిపోయే మోడరన్ ఫోటో షూట్ తో సందడి చేసింది.

తనలో గ్లామర్ ని ఎలివేట్ చేసే విధంగా తీసుకున్న ఈ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు బొద్దుగా, సొట్ట బుగ్గలతో కనిపించే అవికాగొర్ ఈమేనా అన్నట్లు ఆమె లుక్స్ ఉన్నాయి.

రెడ్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ తో క్లివేజ్ అందాలను ఆరబోస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ ని దర్శకులు చూడాలని చెబుతున్నట్లుగా లుక్స్ ఉన్నాయి.

మరి అవికా గోర్ గ్లామర్ ఫోజులు చూసిన తర్వాతన అయిన మన తెలుగు దర్శకులు ఈ అమ్మడికి అవకాశాలు ఇస్తారేమో అనేది వేచి చూడాల్సిందే.

రానా లీడర్ 2 సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?