ఇంటివాడైన రాజ్ తరుణ్.. అతిథిగా వచ్చిన చిన్నారి పెళ్లికూతురు!

టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్, వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

తన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’తో కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్, తొలి సినిమాను సూపర్ హిట్‌గా నిలవడంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.

కాగా తొలి సినిమాలో హీరోయిన్‌గా నటించిన అవికా గోర్‌తో రాజ్ తరుణ్ ఆ తరువాత కూడా సినిమాలు చేశాడు.

‘సినిమా చూపిస్త మావ’ అనే సినిమాలో ఈ జంట కలిసి నటించగా, అది కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక ఈ హీరో తాజాగా తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు.హైదరాబాద్‌లోని తన కొత్త ఇంట్లోకి వెళ్లిన రాజ్ తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు అవికా గోర్ హైదరాబాద్‌కు వచ్చింది.

తన తొలి చిత్రం నుండి ఇప్పటివరకు తన వెంటే ఉంటూ, తనకు ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటున్న అవికా గోర్‌కు ఈ సందర్భంగా రాజ్ తరుణ్ కృతజ్ఞతలు తెలిపాడు.

తామిద్దరం మంచి స్నేహితులు కావడంతో తన కుటుంబ సభ్యులు ఆమెతో చాలా చనువుగా ఉంటారని రాజ్ తరుణ్ తెలిపాడు.

ఇక సినిమాల పరంగా అవికా గోర్ చివరగా ‘రాజు గారి గది 3’లో కనిపించిన సంగతి తెలిసిందే.

అటు రాజ్ తరుణ్ నటించిన లాస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా ఓటీటీలో రిలీజ్ అయ్యి యావరేజ్ చిత్రంగా నిలిచింది.

తన ఇంటికి అతిథిలా వచ్చిన అవికా గోర్‌కు సంబంధించిన ఫోటోలను రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

ఈ జోడి మరోసారి సినిమాలో కలిసి నటిస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఈ జోడీ భవిష్యత్తులో కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?