అవతార్ 2 తెలుగు రాష్ట్రాల యొక్క టార్గెట్‌ ఎంతంటే..!

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 ఈ వారంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే.

ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని కూడా పాండోరా గ్రహానికి తీసుకు వెళ్లేందుకు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరున్‌ ఈ సినిమా ను అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందించాడు అంటూ అంతర్జాతీయ స్థాయి మీడియా లో కథనాలు వస్తున్నాయి.

13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ సినిమా ఇప్పటికీ కూడా ఒక అద్భుతం అన్నట్లుగా ప్రేక్షకులు చూస్తూ ఉంటారు.

అలాంటి అద్భుతానికి కొనసాగింపు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం అంటూ ధీమాతో ఉన్నారు.

ప్రతి ఒక్కరు కూడా అవతార్ 2 సినిమా యొక్క కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.

"""/"/ ఇండియాలో ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల నుండి 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుంది అనే నమ్మకం తో ప్రతి ఒక్కరు ఉన్నారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నూరు కోట్లకు మించి కలెక్షన్స్ నమోదు అవుతాయి అంటూ ఇండియన్ డిస్నీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారట.

ఇండియాలో అవతార్ 2 సినిమా కు ఉన్న క్రేజ్‌ అంతా కాదు.తాజాగా అడ్వాన్స్ బుకింగ్ తోనే ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కలెక్షన్స్ తో పోలిస్తే ఇండియా కలెక్షన్స్ చాలా తక్కువే.

అయినా కూడా ఇండియన్ సినిమాలు సాధించే కలెక్షన్స్ తో పోలిస్తే అవతార్ 2 సినిమా యొక్క కలెక్షన్స్ అద్భుతం అంటూ బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల ఇండియా లో ప్రీమియర్ షో ప్రదర్శించబడ్డ అవతార్‌ 2 కు పాజిటివ్ టాక్ దక్కింది.

కనుక కలెక్షన్స్ వందల కోట్లు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉండడం ఖాయం అంటూ నిపుణులు చెబుతున్నారు.

జస్ట్ వాయిస్‌తోనే సూపర్ ఫేమ్ తెచ్చుకున్న యాక్టర్.. ఎవరో తెలిస్తే..