కామెడీ అంటే అదే.. అలాంటి కామెడీకే డిమాండ్ ఎక్కువ: అవసరాల శ్రీనివాస్

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇండస్ట్రీకి పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి, దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

తాజాగా అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ జంటగా రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంనూటొక్క జిల్లాల అందగాడు దిల్ రాజు క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన చిత్రం నేడు విడుదలయింది.

ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి అవసరాల శ్రీనివాస్ ముచ్చటించారు.ఈ సినిమాకు కథను తానే సిద్ధం చేసుకొని తానే హీరోగా నటించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే హిందీలో వచ్చిన బాల చిత్రానికి మా సినిమా అసలు రీమేక్ కాదని, బాలా చిత్రానికి ఈ సినిమా పూర్తిగా విభిన్నమైనదని శ్రీనివాస్ తెలియజేశారు.

ఈ సినిమా కథను రాయడానికి ముందుగా ఎదుటివారిలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని హేళనగా చేసే మాట్లాడే వారు ఎందరో ఉంటారు.

అలా హేళనగా మాట్లాడటం వల్ల వారి ఆత్మాభిమానం ఏ విధంగా దెబ్బ తింటుందో తెలియజేసేలా కథను రాయాలనే ఆలోచనలో ఉన్నానని తన అనుభవాలను డైరెక్టర్ క్రిష్ తో పంచుకోగా అందుకు క్రిష్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.

"""/"/ నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో బట్టతలతో ఉండే అవసరాల శ్రీనివాస్ ను చూసి అందరూ ఏ విధంగా అవమానిస్తారనే విషయాన్ని ఎంతో అద్భుతంగా చూపించారనీ, ఈసినిమా ఎమోషన్స్ తో కూడిన హ్యూమర్ సినిమాని అని ఇలాంటి కామెడీ సినిమాలకే ఎక్కువ ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ ఈ సినిమా గురించి తెలిపారు.

అలాగే మా సినిమా ద్వారా ప్రపంచానికి సందేశం ఇవ్వాలని ఈ సినిమాను చేయలేదు.

ఎవరిని కించ పరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తెరకెక్కించే లేదు.ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే మా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినట్టే.

అలాగే మా సినిమాలో ఏ పాయింట్ అయినా ప్రేక్షకులను నవ్విస్తే మా సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనేది నా నమ్మకం అంటూ తెలియజేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే అతను దర్శకుడిగా ఫలానా అబ్బాయిఫలానా అమ్మాయి అనే (వర్కింగ్ టైటిల్ తో) ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

వార్2 మూవీకి ఆ ఫైట్ హైలెట్ కానుందా.. ఆ 15నిమిషాలు అభిమానులకు పూనకాలే!