Avasarala Srinivas : ఆ సినిమా ఫ్లాప్ అయ్యుంటే నడిరోడ్డు మీదికి వచ్చేవాడిని : అవసరాల శ్రీనివాస్
TeluguStop.com
అవసరాల శ్రీనివాస్( Avasarala Srinivas ) రైటర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా అతడి సినిమా ప్రస్థానం ఎన్నో మలుపులు తిరుగుతూ కొనసాగుతోంది.
మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన శ్రీనివాస్ అమెరికాలో స్క్రీన్ రైటింగ్ లో డిప్లమా పూర్తి చేశాడు.
ఇక న్యూయార్క్( New York ) లోనే ఏడాది పాటు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు.
ఎంతో చదువు, తెలివి ఉండి, మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా శ్రీనివాస్ పూర్తిగా సినిమా వైపే కెరీయర్ ను కొనసాగించాలనుకున్నాడు.
మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అష్టా చమ్మా( Ashta Chamma ) అనే సినిమా ద్వారా నటుడిగా వెండితెరపై కనిపించాడు.
నటుడిగా కమెడియన్ గా మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ గా అవసరాల శ్రీనివాస్ కి పేరు ఉంది.
ఇక మొట్టమొదటిగా ఊహలు గుసగుసలాడే అనే సినిమాకి దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా మారారు.
"""/" /
మొదటి సినిమా మంచి కామెడీ జోనర్ లో తీయడంతో ఆ సినిమా ఘనవిజయం సాధించింది ఈ సినిమా ద్వారా రాశి ఖన్నా( Rashi Khanna ) హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత అవసరాల శ్రీనివాసు జో అచ్యుతానంద అనే మరో చిత్రానికి దర్శకత్వం చేశారు.
అవతార్ పార్ట్ 2 కి కూడా డైలాగ్ రైటర్ గా పనిచేసిన అవసరాల శ్రీనివాస్ నటుడిగా కంటే కూడా రైటర్ గానే తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానంటూ చెబుతున్నాడు.
అయితే తాను మొదటి సినిమా తీయడానికి ఒక మహిళ పురిటి నొప్పులు పడ్డంత శ్రమ తీసుకున్నానని చెప్పాడు శ్రీనివాస్ దాదాపు ఎన్ని సంతకాలు పెట్టానో తెలియదు కానీ ఉన్నదంతా కూడా సినిమా కోసమే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు.
"""/" /
ఆ సినిమాకి కొర్రపాటి ప్రొడక్షన్స్( Korrapati Productions ) నిర్మాణ సంస్థగా ఉన్నప్పటికీ తనకు అవకాశం ఇచ్చేముందు వారు కూడా తనని ఎంతో పరీక్షించారని సినిమా విజయం అవుతే తప్ప తన కెరియర్ ముగిసిపోతుందని తెలిసి కూడా తాను ఎక్కడ అడిగితే అక్కడ సంతకం చేశానని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నానని లేకపోతే కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడే పరిస్థితి వచ్చేది అంటూ చెప్పుకున్నారు అవసరాల శ్రీనివాస్.
నా పరిస్థితి మాత్రమే కాదు ఇండస్ట్రీలో దాదాపు అందరికీ మొదటి సినిమా ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడు.
జాతిరత్నాలు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్.. మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!