ఏందయ్యా ఇది.. ఆటోకి కిటికీ అమర్చిన వ్యక్తి.. పిక్ వైరల్..
TeluguStop.com
ఇండియాలో ఆటోలు కేవలం ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలు మాత్రమే కాదు, అవి చాలా క్రియేటివ్ థాట్స్ కు ఒక వేదిక కూడా అవుతుంటాయి.
ఆటోల మీద వేసే రంగురంగుల విద్యుత్ దీపాలు, ఫన్నీ కొటేషన్లు, క్రియేటివ్ డిజైన్లు, కొత్త కొత్త పోస్టర్లు చాలా మందిని ఆకర్షిస్తాయి.
అయితే బెంగళూరులోని( Bengaluru ) ఒక ఆటో డ్రైవర్ మాత్రం ఆటోని మరింత అందంగా మార్చడానికి ఒక కిటికీని( Window ) అమర్చాడు.
అవును, మన ఇళ్లల్లో కనిపించే ఒక విండో ఆటోకి జోడించాడు. """/" /
ఇండియాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న సిటీ బెంగళూరు.
ఆ ప్రాంతానికి తగినట్లుగానే ఇక్కడి ప్రజలు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు.చిరు వ్యాపారాలు కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు వచ్చి చాలామందిని ఆశ్చర్యపరుస్తారు.
అలాంటి వాటిలో భాగంగా ఇప్పుడు ఓ ఆటో రిక్షా( Auto Rickshaw ) చాలా విచిత్రంగా కనిపిస్తోంది.
ఈ ఆటో రిక్షా ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది.తన్వి గైక్వాడ్( Tanvi Gaikwad ) అనే వ్యక్తి ఈ ఆటో ఫోటోను X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో ఆటోకు ఒక వైపు కిటికీ అమర్చడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇది చూడడానికి సగం కారు, సగం ఆటో రిక్షా లాగా ఉంది. """/" /
ఆటోలో ప్రయాణించే వారు ఎక్కేందుకు, దిగేందుకు ఒక వైపు తెరిచి ఉంటుంది.
కానీ మరొక వైపు మాత్రం ప్లాట్‌గా కిటికీ ఉంది.ఇది చూసిన చాలా మందికి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.
తన్వి ఈ ఫోటో పోస్ట్ చేసి, “ఈ ఆటోకు కిటికీ ఉందట, ఎంత అద్భుతం” అని రాసింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే చాలా మంది దీన్ని చూసి కామెంట్లు చేశారు.
ఈ పోస్ట్‌ను 5 లక్షలకు పైగా మంది చూశారు.చాలా మంది ఈ ఆటో చాలా అద్భుతంగా అన్నారు.
వర్షం పడుతున్నప్పుడు లేదా చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ ఉండటం ఎంతో సౌకర్యంగా ఉంటుందని కొందరు చెప్పారు.
ఇది ఒక కూలెస్ట్ ఆటో అని ఒకరు పేర్కొనగా, ఆటోవాలా కూడా ఈ రోజుల్లో చాలా క్రియేటివిటీ చూపిస్తున్నారు అని మరి కొంతమంది పేర్కొన్నారు.
"విండోస్ రన్నింగ్ ఇన్ ఆటోమోడ్" అని ఇంకొకరు సరదాగా చమత్కరించారు."కొంతమంది డ్రైవర్లు తమ వాహనాలను తమ పిల్లల కంటే చాలా బాగా చూసుకుంటారు.
అంత ప్రేమ ఉంటేనే వీటిని ఇలా డిజైన్ చేస్తుంటారు." అని ఇంకొకరు అన్నారు.
ఈ వెరైటీ ఆటో పై మీరు కూడా ఒక లుక్కు వేయండి.
రాజమౌళి సినిమాలలో ఆ సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయట.. ఏం జరిగిందంటే?