బైక్‌ను దాటపోయి పల్టీలు కొట్టిన ఆటో.. వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏ విషయం జరిగినా నిమిషాల్లో అందరికి తెలిసిపోతుంది.

ప్రపంచం అంత సోషల్ మీడియా చుట్టే తిరుగుతూ ఉంటుంది.ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఎక్కడ ఏ బ్రేకింగ్ న్యూస్ జరిగినా నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.

వచ్చిన బ్రేకింగ్ న్యూస్ నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.అలానే ఇప్పుడు సోషల్ మీడియా లో( Social Media ) ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.

"""/" / ఆ వీడియోలో బైక్ ని( Bike ) ఓవర్‌టేక్ చేస్తున్న ఒక ఆటో( Auto Rickshaw ) అదుపు తప్పి బోల్తా పడిపోయింది.

వివరాలోకి వెళితే, హైదరాబాద్ లోని దూర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్( Durgam Cheruvu Cable Bridge ) సమీపంలో ఒక ఆటో, బైక్ ని ఓవర్టేక్ చెయ్యబోయి అదుపు తప్పి బోల్తా పడిపోయింది.

ఈ ఘటన లో ఆటో డ్రైవర్ తో పాటుగా మరో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

వాహనాలు ఎంత జాగ్రత్తగా నడపాలని చెప్తున్నపటికీ అతి వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

"""/" / జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపుగా ఈ ఆటో ప్రయాణిస్తుంది.

ఆ సమయంలో ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతుండటం, అలానే బైక్ ను క్రాస్ చేయాలనుకోవడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.

అదృష్టం కొద్దీ వెనకనుంచి వస్తున్న ఒక కారు డ్రైవర్ ఈ ఆటోకు డాష్ ఇవ్వకుండా పక్కకి తిప్పాడు.

దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సెల్ ఫోన్( Cell Phone ) వాడుతూ డ్రైవ్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఆ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులో పడేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలను చూసైనా వాహనదారులు చక్కగా రూల్స్ పాటించాలని నెటిజన్లు కోరుతున్నారు.

పుట్టబోయే పిల్లల గురించి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు.. ప్రియమణి కామెంట్స్ వైరల్!