Minister Sridhar Babu : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో( Mahalakshmi Scheme ) భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. """/" / ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.

12 వేలు అందజేస్తామని వెల్లడించారు.వచ్చే బడ్జెట్ లో ఈ హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తమ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ భరోసా ఇచ్చిందని తెలిపారు.