ఆటోను పక్కకు తీయమన్నందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి..!
TeluguStop.com
ఆటోను పక్కకు తీయమని చెప్పినందుకు తీవ్ర ఆవేశానికి గురైన ఓ ఆటో డ్రైవర్ నానా రచ్చ చేశాడు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ అని కూడా చూడకుండా వాగ్వాదానికి దిగాడు.అంతేనా అతడి కాలర్ పట్టుకొని మరీ బస్సులోంచి లాగాడు.
కిందకు వచ్చిన అతడిని విపరీతంగా కొట్టాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఘటన ఎఖ్కడ జరిగింది, ఏమైందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఈ ఘటన చోచు చేసుకుంది.సిటీ బస్ డ్రైవర్ పై ఓ ఆటో డ్రైవర్ విచక్షణా రహితంగా దాడి చేశారు.
ఎమ్ఎమ్ డీసీ బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే చోట ఆటో నిలపడంతో బస్సు డ్రైవర్.
వాహనాన్ని పక్కకు తీయాలని కోరాడు.మెల్లిగానే చెప్పినా ఆటో డ్రైవర్ కోప్పడ్డాడు.
నువ్వేంట్రా నాకు చెప్పేదంటూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.అంతే ఒక్క ఉదుటున ఆటోలోంచి డ్రైవర్ యాదయ్య దిగి వచ్చి.
ఆర్టీసీ బస్సులోకి పరుగులు తీశాడు.బస్సు డ్రైవర్ కాలర్ పట్టుకొని మరీ కిందకు లాక్కొచ్చాడు.
నన్నే ఆటో తీయమంటావా అంటూ దాడికి దిగాడు.కండక్టర్, ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.
యాదయ్య ఆఘలేదు.పదుల సంఖ్యలో ప్రజలు వచ్చి పక్కకు జరిపితేనే అతను దాడి చేయడం ఆపాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.వీడియో చూసిన వారంతా ఆటో డ్రైవర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
వీడియో: రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేశాడు.. కింద పడటంతో మృతి..?