సరికొత్త ఆప్షన్ ను తీసుకు రాబోతున్న ఫోన్ పే, గూగుల్ పే…!
TeluguStop.com
భారత్ లో డిజిటల్ పేమెంట్ రంగంలో ముందుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.
ఇక ఇందుకు సంబంధించిన విషయం చూస్తే.వీటిలో ఇప్పటి వరకు యూపీఐ విధానం ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్ లేదు.
ఇకపై ప్రతి నెలా డిజిటల్ పేమెంట్ అయిన మొబైల్ ఫోన్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇంకా ఇతరత్ర వీటికి సంబంధించి బిల్లులను ఆటో డెబిట్ ఆప్షన్ ను విధానంను జత చేయనున్నారు.
ఇక ఈ కొత్త ఆప్షన్ కోసం ఈ రెండు సంస్థలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తాయని బ్యాంకర్లు తెలిపారు.
అయితే ఇది వరకే ఫోన్ పే, గూగుల్ పే రికరింగ్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ పై వారి పనులను మొదలు పెట్టాయి.
ఇక ఇందుకు సంబంధించి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే నెలలో రాబోతున్నట్లు ఓ బ్యాంకు అధికారి తెలియజేశారు.
"""/"/
రోజురోజుకీ అనేక మార్పులు సంతరించుకుంటున్న డిజిటల్ ప్రపంచంలో ఆన్ లైన్ లావాదేవీలు మరింతగా పెరిగి పోతున్నాయి.
ముఖ్యంగా కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితమైన జనం యూపీఐ విధానం ద్వారా అత్యధిక ట్రాన్సాక్షన్ లను జరిపినట్లు బ్యాంకు అధికారులు తెలియజేస్తున్నారు.
కేవలం ఒక్క జూలై మాసం లోనే 1.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డు చేసినట్లు సమాచారం.
ఇక వీటిలో అత్యధికంగా గూగుల్ పే, అమెజాన్, ఫోన్ పే వాటి ద్వారా జరిపిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు సంచారం.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?