రెండో టెస్టులో భారత్ పై గెలుపు కోసం ఆస్ట్రేలియా కొత్త వ్యూహం..!

భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.

జట్టు ఎంపికలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్ ఫలించింది.ఇక తొలి ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్లు తీసుకోవడమే కాకుండా హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు రవీంద్ర జడేజా.

తొలి టెస్ట్ లో భారీ పరాజయం పొందిన ఆస్ట్రేలియా తన వ్యూహాన్ని కాస్త మార్చుకొని కొత్త కుర్రాడిని బరిలోకి తీసుకోనుంది.

ఇక ఆస్ట్రేలియా టీం లో ఉన్న కొత్త స్పిన్నర్ టాడ్ మర్ఫీ అద్భుతంగా రాణించాడు.

స్పిన్నర్లు ఉంటేనే రాణించగలం అని భావించిన ఆస్ట్రేలియా, స్పిన్నర్ మాథ్యూ కనెమన్ ను రెండో టెస్టులో ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక కనెమన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 35 వికెట్లు తీసి తనకంటూ ఒక రికార్డును క్రియేట్ చేసుకున్నాడు.

అంతేకాకుండా 2022-23 సీజన్లో 16 వికెట్లను తీశాడు. """/"/ ఈ విషయంపై కనెమన్ స్పందిస్తూ తనకు జార్జ్ బైలీ నుండి కాల్ వచ్చిందని, భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో అవకాశం వచ్చిందని చెప్పాడు.

ఇలా అనుకోకుండా రెండో టెస్టులో ఆడే అవకాశం వస్తుంది అని ఊహించలేదని చెప్పాడు.

తాను భారత్ పై ఆడేందుకు ప్రత్యేకమైన ప్లాన్లు చేయలేదని లంక సిరీస్ నెట్స్ లో ఏ విధంగా బౌలింగ్ చేశాడో అదే కాన్ఫిడెన్స్ తో భారత్ తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడతానని తెలిపాడు.

"""/"/ ఇంకా లంకలో నాథన్ లియాన్ బౌలింగ్ చేసే విధానాన్ని క్షుణ్ణంగా గమనించానని, తిరిగి ఆస్ట్రేలియా జట్టులో చేరి ఆడే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

ఇక తనకు ఇష్టమైన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా కూడా ఒకడని తెలుపుతూ జడేజా, అక్షర్ పటేల్ లాగా ఆడేందుకు ట్రై చేస్తానని పేర్కొన్నాడు.

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!