ఆస్ట్రేలియా: అక్టోబర్‌లో గరిష్టస్థాయికి కేసులు, ఐసీయూకి కటకటే.. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రానికి హెచ్చరిక

ఆస్ట్రేలియాలో కరోనా కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటి ఆంక్షల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా అక్కడ వైరస్ వ్యాప్తి నెమ్మదించడం లేదు.

ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం, దేశంలోనే అతిపెద్ద నగరం సిడ్నీలు డెల్టా వేరియంట్‌కు హాట్ స్పాట్‌గా మారాయి.

ఈ క్రమంలో న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ సంచలన ప్రకటన చేశారు.కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలో ఐసీయూలలో చేరే వారి సంఖ్య అక్టోబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు.

న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం రికార్డు స్థాయిలో 1,290 కొత్త కేసులు వెలుగు చూశాయి.

దీనిపై ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ మాట్లాడుతూ.అక్టోబర్ నెలలో ఐసీయూలకు అధిక డిమాండ్ వుంటుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 840 మంది ఆసుపత్రిలో వుంటే.వీరిలో 137 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్నారని.

వీరిలో 48 మందికి వెంటిలేషన్ అవసరమని గ్లాడిస్ చెప్పారు.న్యూసౌత్ వేల్స్‌లో కోవిడ్ వల్ల కొత్తగా నలుగురు చనిపోయారని.

వీటితో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,003కి చేరుకుందని ఆయన తెలిపారు.

వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు గాను వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని గ్లాడిస్ చెప్పారు.

కాగా, దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా 1,375 కొత్త కేసులు నమోదయ్యాయి.మిగిలిన అన్ని దేశాల కంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్‌డౌన్, దిగ్బంధం వంటి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేసింది.

అయితే డెల్టా వేరియంట్ ముందు సర్కారు వారి పప్పులు ఉడకడం లేదు.మరోవైపు గణాంకాల ప్రకారం.

దేశంలో 16 అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో కేవలం 33 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకాలను పూర్తి చేసుకున్నారు.

అయితే కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్రభావాలు కనిపించడంతో ఆస్ట్రాజెనెకా టీకా వ్యాక్సిన్‌ వాడకంపై ఆస్ట్రేలియాలో అనేక తర్జన భర్జనలు జరిగాయి.

అయితే నిపుణుల సలహాలు, సూచనల తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది.

అటు ఆస్ట్రేలియాలో జనాభా పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన విక్టోరియాలో సోమవారం కొత్తగా 73 కేసులు వెలుగు చూశాయి.

దీంతో మెల్‌బోర్న్ సహా రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ , ఇతర ఆంక్షలను పొడిగిస్తామని విక్టోరియా ప్రీమియర్ డాన్ ఆండ్రూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!