ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా పౌరుడికి 8,000 ఏళ్ల శిక్ష.. ఏం ఘనకార్యం చేశాడో తెలిస్తే..!

ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా పౌరుడికి 8,000 ఏళ్ల శిక్ష ఏం ఘనకార్యం చేశాడో తెలిస్తే!

ఇజ్రాయెల్‌ దేశానికి వెళ్లిన ఒక ఆస్ట్రేలియా పౌరుడికి అక్కడి ప్రభుత్వం ఒక వింత శిక్ష విధించింది.

ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా పౌరుడికి 8,000 ఏళ్ల శిక్ష ఏం ఘనకార్యం చేశాడో తెలిస్తే!

8 వేల సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదని అతడిని ఆదేశించింది.

ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా పౌరుడికి 8,000 ఏళ్ల శిక్ష ఏం ఘనకార్యం చేశాడో తెలిస్తే!

దాంతో 2013వ సంవత్సరం నుంచి అతడు ఇజ్రాయెల్‌లోనే చిక్కుకుపోయాడు.తనపై ఉన్న నిషేధం ఇప్పట్లో తీరదు కాబట్టి ఏం చేయాలో తెలియక అతడు తల్లడిల్లిపోతాడు.

మరి ఇలాంటి శిక్షను అతడికి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఎందుకు విధించిందో ఇప్పుడు చూద్దాం.

నోయామ్ హప్పర్ట్ (44) అనే ఒక ఆస్ట్రేలియన్ పౌరుడు ఓ ఇజ్రాయెల్‌ దేశస్థురాలిని పెళ్లి చేసుకున్నాడు.

కొద్దిరోజుల పాటు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.ఆ తర్వాత ఆమెను వదిలేశాడు.

దాంతో 2011లో హప్పర్ట్ భార్య తన పిల్లలతో కలిసి ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది.

2012లో హప్పర్ట్ తన పిల్లలతో కొద్దిరోజుల పాటు కలిసి ఉండడానికి ఇజ్రాయెల్‌ వెళ్లాడు.

కానీ అదే అతనికి శాపంగా మారింది.ఆ సమయంలో భార్య హప్పర్ట్ నుంచి విడాకులు కోరింది.

విడాకులు తీసుకున్న తరువాత తన పిల్లల పోషణ కోసం హప్పర్ట్ 3 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా కోర్టుకెక్కింది.

దాంతో స్థానిక విడాకుల చట్టం ప్రకారం హప్పర్ట్ రూ.22 కోట్లు చెల్లించడం అనివార్యమైంది.

ఒకవేళ ఈ స్థాయిలో డబ్బులు చెల్లించకపోతే డిసెంబర్ 31, 9999 సంవత్సరం వరకు దేశాన్ని విడిచి వెళ్లకూడదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది.

దాంతో అతడు 8,000 వేల సంవత్సరాల వరకు ఆ దేశంలోనే బందిఖానా కావాల్సి వస్తోంది.

ఆస్ట్రేలియన్ మీడియాతో హప్పర్ట్ మాట్లాడుతూ, చాలా మంది స్థానిక విడాకుల చట్టాల గురించి తెలియక దేశంలోనే మగ్గిపోతున్నారని చెప్పుకొచ్చాడు.

"""/" / ఇజ్రాయెల్ మహిళను పెళ్లి చేసుకొని ఆ దేశ లో చిక్కుకుపోయిన వేలాది మంది విదేశీ పురుషులలో తాను ఒకడని వాపోతున్నాడు.

తన చిన్న పిల్లలిద్దరికీ 18 ఏళ్లు వచ్చే వరకు తనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం 'స్టే-ఆఫ్-ఎగ్జిట్ ఆర్డర్' జారీ చేసిందని అతడు వెల్లడించాడు.

అప్పటివరకు నెలకు 5000 ఇజ్రాయెల్ షెకెళ్ల మనీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్కన ఆ మొత్తం 3 మిలియన్ల డాలర్లకు చేరుకుంది.

ఒక దిగ్గజ ఫార్మా కంపెనీలో అనలిటికల్ కెమిస్ట్ గా పనిచేస్తున్న హప్పర్ట్ ఆ స్థాయిలో డబ్బులు చెల్లించలేక దేశాన్ని విడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

"""/" / అయితే స్థానిక విడాకుల చట్టం గురించి తెలియక చాలామంది ఈ ఉచ్చులో పడుతున్నారని బ్రిటిష్ మీడియాతో పాటు చాలా మంది వీడియో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హింసాత్మక చట్టాల నుంచి విదేశీయులను మినహాయించాలి అంటూ మరికొందరు నిరసనలు చేస్తున్నారు.

ఏదిఏమైనా ఆ దేశ మహిళను చేసుకోవడమే అతనికి ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది.

ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.కాగా పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక ఆ మహిళను ఎందుకు వదిలేయాలి? చేసిన ఘనకార్యానికి తగిన ఫలితం అనుభవిస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆ తేదీన రిలీజ్ కానుందా?