లేడీ ప్యాసింజర్‌కి హగ్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్.. ఎమోషనల్ వీడియో వైరల్…

కొన్ని సందర్భాల్లో బాధలో ఉన్నప్పుడు ఎలాంటి పరిచయం లేకపోయినా అపరిచితులు వచ్చి ఓదార్చుతారు.

ఇలాంటి వ్యక్తుల మనసు ఎంతో మంచిదని చెప్పుకోవచ్చు.ఇంత మంచి మనస్తత్వం పేదవాళ్లలో కూడా కనిపిస్తుంది.

తాజాగా ఆస్ట్రేలియాలోని( Australia ) ఓ ఉబెర్ డ్రైవర్( Uber Driver ) కూడా తన మంచితనాన్ని చూపించే చాలా మంది నెటిజెన్ల హృదయాలను టచ్ చేస్తున్నాడు.

అతని పేరు జేమ్స్ బడే.దుఃఖంలో ఉన్న తల్లికి ఆప్యాయతను చూపించి అతడు చాలామంది ప్రశంసలు అందుకుంటున్నాడు.

అతని కారు కెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

"""/" / మెల్‌బోర్న్‌లో కొంతమంది వ్యక్తులను జేమ్స్( James ) తన క్యాబ్ నుంచి దింపుతున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు.

అదే సమయంలో అతడు ప్యాసింజర్లకు( Passengers ) వీడ్కోలు పలికాడు.అప్పుడు వారిలో ఒకరు అతని కిటికీని తట్టారు.

కొడుకును కోల్పోయిన ఓ తల్లి ఆమె.ఆమె ఏడుస్తూనే ఉంది.

డ్రైవర్ తో మాట్లాడుతూ నువ్వు చనిపోయిన నా కొడుకులానే కనిపిస్తున్నావని ఆమె చెప్పింది.

జేమ్స్ ఆమె పట్ల జాలిపడ్డాడు.ఆమెను అడిగి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

"""/" / మొదటగా ఉబెర్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది.

కాగా తాజాగా గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ దీనిని మళ్లీ షేర్ చేసింది.

చాలా మంది ఈ వీడియోను చూసి ఎమోషనల్ అవుతున్నారు.బాధలో ఉన్న సాటి మనిషి పట్ల దయ చూపడం ఎంత అవసరమని చాలామంది ఈ వీడియో చూసి కామెంట్లు పెట్టారు.

ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

విశాఖ బీచ్‌: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!