ఆస్ట్రేలియా : భారత సంతతికి చెందిన మహిళ హత్య.. రెండు నెలలకు అనుమానితుడి అరెస్ట్
TeluguStop.com
ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన భారత సంతతి మహిళ కృష్ణ చోప్రా హత్య కేసులో పోలీసులు సైమన్ జోన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జనవరి 31న చోప్రా ఓ ఇంట్లో శవమై కనిపించింది.దాదాపు రెండు నెలల సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం వార్విక్‌లో జోన్స్‌ను అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు అధికారులు.
అనంతరం శుక్రవారం ఉదయం జోన్స్‌ను కోర్టులో హాజరుపరిచారు.ఏబీసీ కథనం ప్రకారం.
జోన్స్ తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయకపోవడంతో అతనిని జైలుకు తరలించారు.
ఈ కేసు విషయమై పూర్తి ఆధారాలు సేకరించేందుకు పోలీసులకు కోర్ట్ ఎనిమిది వారాలు గడువు విధించింది.
దీంతో మే 20న తిరిగి కోర్టు విచారణ జరపనుంది.చోప్రా ఒంటరిగానే వుంటున్నారు.
ఈ ఏడాది జనవరి 20న టూవూంబాలో చివరిగా కనిపించారు.తర్వాత 11 రోజులకు టూవూంబాకు ఉత్తరాన పార్క్ రోడ్ ఇంటిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.
కృష్ణ చోప్రా మృతదేహం బయటపడటానికి 10 రోజుల ముందు ఆమె చనిపోయి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తలకు బలమైన గాయం కావడంతోనే కృష్ణ చోప్రా మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.
జనవరి 21 తర్వాత అసలు ఏం జరిగింది, ఆమె ఎలా హత్యకు గురైంది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జనవరి 21న కృష్ణ చోప్రా క్రౌస్ నెస్ట్, హైఫీల్డ్స్, టూవూంబాలోని కమ్యూనిటీలలో పరిచయస్తులను కలిసి వుండొచ్చని డిటెక్టివ్ సీనియర్ సార్జెంట్ పాల్ మెక్ కస్కర్ మీడియాకు తెలిపారు.
గత నెల చివరిలో పార్క్‌రోడ్‌లోని ఆమె ఇంటి సమీపంలో తనిఖీల సందర్భంగా ఒక ఇనుప రాడ్‌ను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
47 సెంటీమీటర్ల పొడవున్న ఈ రాడ్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. """/"/
కృష్ణ చోప్రా.
‘‘మీల్స్ ఆన్ వీల్స్’’తో కలిసి పనిచేసిన స్వచ్ఛంద సేవకురాలు.కమ్యూనిటీకి భోజనాలు పంపిణీ చేయడం , భోజన ప్యాకెట్లను ప్యాకింగ్ చేయడం వంటి విధులు నిర్వర్తించేది.
Oscars 2025 : ఆస్కార్ వేదికపై హిందీలో స్వాగతం .. హోస్ట్‌పై ప్రశంసల వర్షం