కారులో ప్ర‌యాణిస్తుండ‌గా సౌండ్‌.. ఏంటా అని చూస్తే

మ‌నం ఓ చోట ఉన్నామంటే అక్క‌డేముందో లేదో అని క్షుణ్ణంగా ప‌రీక్షించిన త‌ర్వాతే అక్క‌డ కూర్చోవాలి.

అంతేగానీ ఎలా ఉన్నా స‌రే అని అక్క‌డే ఉన్నామ‌నుకోండి అక్క‌డ ఏమైనా ఉండే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం ఇలాంటి వీడియోలు మ‌నం చాలానే చూస్తున్నాం.కొన్ని సార్లు పార్క్ చేసిన కారుల్లో, లేదంటే బీరువాల్లో కూడా పాములు దూరుతున్న ఘ‌ట‌న‌లు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చెక్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.అదేంటో చూసేద్దాం.

ఒక‌ప్పు డు ఇండ్ల‌లోకి పాములు రావ‌డం కామ‌న్ అయిపోయేది.కానీ ఇప్పుడు వాటి ప్లేస్ లో కొండ చిలువ‌లు వ‌స్తున్నాయి.

ఎప్పుడు ఎక్క‌డ ఎలా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కావ‌ట్లేదంటే వీటి బీభ‌త్సం ఎంత‌లా ఉందో అర్థంచేసుకోవ‌చ్చు.

ఎక్కువ‌గా కార్ల‌లోనే ఇవి దూర‌డాన్ని కూడా చూడొచ్చు.ఎందుకంటే కార్లు చాలా ఇరుకుగా ఉంటాయి కాబ‌ట్టి అందులో వెచ్చ‌గా దూరేందుకు ఇవి ఇష్ట‌ప‌డుతున్నాయంట‌.

ఇక ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో కూడా ఓ కొండ చిలువ కారులోనే దూరిపోయింది.

అయితే అది ఎక్క‌డ దాక్కుందో తెలిస్తే షాక్ అయిపోతారు. """/" / ఆస్ట్రేలియా దేశానికి చెందిన జోష్‌ కాస్ట్‌లీ రీసెంట్ గా త‌న ఫ్యామిలీతో క‌లిసి క్వీన్స్‌లాండ్‌కు టూర్‌కు వెళ్లాడు.

అయితే అక్క‌డ తిరిగేందుకు త‌న కారును పార్క్‌ చేశాడు.ఇక తన కుటుంబంతో  క‌లిసి లోప‌ల‌కు వెళ్లి అంతా క‌లియ‌తిరిగారు.

కానీ బ‌య‌ట‌కు వ‌చ్చి కారులోకి ఎక్కేలోపే ఓ పెద్ద కొండ చిలువ కారులోకి ప్రవేశించింది.

అది ఎంచ‌క్కా ముందు సీటు ద‌గ్గ‌ర ఉండే అద్దానికి చుట్టేసుకుని భ‌యంక‌రంగా క‌నిపించింది.

దీంతో జోష్ వెంట‌నే మరో స్నేక్‌ క్యాచర్ ను పిలిపించి దాన్నిప‌ట్టించాడు.అంతేగానీ తాను మాత్రం దాన్ని ముట్టుకోలేదు.

ఇక్కడ మ‌రో విష‌యం ఏంటంటే జోష్ కూడా స్నేక్ క్యాచ‌ర్‌.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన