ఆస్ట్రేలియా : భారతీయులే టార్గెట్…వరుస దాడులతో ఆందోళనలో భారతీయులు..!!
TeluguStop.com
ఆస్ట్రేలియా లో ఉంటున్న భారతీయులకు రక్షణ కరువయ్యింది.వరుసగా జరుగుతున్న దాడులతో భయాందోళనలకు లోనవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం భారత్ కు చెందిన జానక్ పటేల్ అనే వ్యక్తిపై దాడి జరిగిన ఘటన అందరికి తెలిసిందే ఆక్లాండ్ లో అతడు పనిచేసే ప్రాంతంలోనే అతడిని హత్య చేశారు.
ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు కూడా.ఈ పరిణామంతో అక్కడి భారతీయులు ఆందోళన చెందారు.
ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది.
భారతీయులే టార్గెట్ అన్నట్టుగా న్యూజిలాండ్ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తీ సిదు నరేష్ పై తాజాగా దాడికి తెగ బడ్డారు దుండగులు.
న్యూజిల్యాండ్ లోని హామిల్టన్ లో ఓ స్టోర్ ను సొంతగా నడుపుతున్న నరేష్ పై దుండగులు విరుచుకు పడ్డారు.
ముసుగులు ధరించి అతడి స్టోర్ లోకి వచ్చిన దుండగులు నరేష్ పీకపై కత్తి పెట్టి బెదిరించారు.
డబ్బు ఇవ్వాలంటూ స్టోర్ ను మొత్తం ధ్వంసం చేశారు, ఆ పై నరేష్ ను కత్తితో బెదిరిస్తూ డబ్బులు మొత్తం కాజేశారు.
ఈ క్రమంలో వారికి అడ్డుపడిన వ్యక్తిపై దాడి చేసి అక్కడి నుంచీ పారిపోయారు.
కాగా. """/"/ దాడి చేసిన దుండగుల వయసు కేవలం 16 ఏళ్ళు లోపుల ఉంటుందని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు, భాదితులు.
ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి అక్కడి సిసి కెమెరాలను పరిశీలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలాఉంటే భారతీయులపై వరుసగా దాడులు జరగడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియా లోని భారతీయులు తమపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని వాపోతున్నారు.
ప్రభుత్వం తమపై జరుగుతున్న దాడులను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి