ఫ్లయిట్ లో గొడవపడి అద్దాన్ని పగలకొట్టారు..!

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవ అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.

ప్లేస్ మారినంత మాత్రానా వారి మధ్య గొడవలు ఉండవన్ కాదు.అది నేల మీద అయినా గాల్లో అయినా.

రీసెంట్ గా ఫ్లైట్( Flight ) గాల్లో ఉండగా ముగ్గురు మహిళల మధ్య గొడవ జరిగింది.

అది చిన్నగా మొదలై దాదాపు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది.ఏకంగా ఆ ఫ్లైట్ అద్దాలు పగల గొట్టేలా చేసింది.

వారు చేసిన ఈ హంగామా వల్ల ఫ్లైట్ ని అత్యవసరమగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో అని తెలుస్తుంది. """/" / క్విన్స్ లాండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియా( Australia ) నార్తర్న్ టెరిటరీకి వెళ్లే ఫ్లైట్ లో ఈ గొడవ జరిగంది.

ఫ్లైట్ లో చిన్న తగాదాగా మొదలైన ఈ ఫైట్ ఏకంగా గాజు సీసాతో ప్రయాణికుల మధ్య దాడికి దారి తీసింది.

ఒకరినొకరు తోసుకోవడం వల్ల గొడవ పెద్దదైంది.ఫ్లైట్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ గొడవ ఆగలేదు.

ఇక చేసేది లేక ఆ ఫ్లైట్ ని క్విన్ ల్యాండ్స్( Quinn Lands ) లో ఆపాల్సి వచ్చింది.

ఈ గొడవలో ఫ్లైట్ కిటికీ కూడా పగలగొట్టారని తెలుస్తుంది.ఈ గొడవకు కారణమైన నలుగురు ప్రయాణీకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ధోనీని హైలెట్ చేయడం తెలుగువాళ్లకు నచ్చలేదు.. వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్!