పుష్ప క్రేజ్.. తగ్గేదేలే అంటున్న ఆస్ట్రేలియన్ కుర్రాడు.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

ఈ సినిమాతో అల్లు అర్జున్ సైతం ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు.

ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో సరికొత్త ట్రెండ్ ను సృష్టించాడు.తన మ్యానరిజంతో, హెయిర్ స్టైల్ తో డ్యాన్స్ తో డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రతీ సినిమాకు అదరగొట్టే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా తన మ్యానరిజాన్ని చూపించి అదరగొట్టాడు.

ఈసారి ఏకంగా వరల్డ్ వైడ్ గా తన మ్యానరిజం తో అలరించాడు.తగ్గేదేలే అనే హుక్ స్టెప్ తో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేసాడు అనే చెప్పాలి.

"""/" / ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మ్యానరిజం అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.

ఈ మ్యానరిజాన్ని హుక్ స్టెప్ ను చాలా మంది క్రికెటర్స్ సైతం ఫాలో అయ్యి వారి ఫ్యాన్స్ ను అలరించారు.

ఇండియన్ క్రికెటర్స్ మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం తగ్గేదేలే హుక్ స్టెప్ తో అదరగొట్టారు.

ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన స్టెప్ ఆయన ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.

అక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. """/" / అప్పటి నుండి ఆస్ట్రేలియన్ కుర్రాళ్ళు కూడా ఇదే హుక్ స్టెప్ ను చేస్తూ అలరిస్తున్నారు.

తాజాగా జరుగుతున్న సిరీస్ లో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆస్ట్రేలియన్ కుర్రాడు తగ్గేదేలే అంటూ మ్యానరిజం చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

దీంతో ఇంకా ఏ మాత్రం పుష్ప ట్రెండ్ తగ్గలేదు అనే చెప్పాలి.ఇక ప్రెజెంట్ ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుండగా ఇది ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

ఓరి నాయనో, ఈమె ఓల్డ్ ఫ్రిడ్జ్‌ను ఎలా మార్చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..