భారతీయ విద్యార్ధులకు షాక్.. ఆస్ట్రేలియాలో చదువులు ఇక భారమే

నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, జీవితంలో స్థిరపడటానికి అనువైన మార్గాలు ఉండటంతో భారతీయ యువత విదేశాల్లో చదువుకోవడానికి ఇష్టపడుతోంది.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా, జర్మనీ తదితర దేశాలు మన విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.

తల్లిదండ్రులు కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వారిని ఫారిన్ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు.కానీ కరోనా , ఇతర కారణాలు పరిస్ధితులను తారుమారు చేశాయి.

పలు దేశాలు ఇమ్మిగ్రేషన్ ఛార్జీలను( Immigration Charges ) భారీగా పెంచేయడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు విదేశాల్లో ఉన్నత విద్య భారంగా మారింది.

తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరింది ఆస్ట్రేలియా. """/" / విదేశీ విద్యార్ధులు చెల్లించాల్సిన ఫీజులను కంగారూ దేశం భారీగా పెంచేసింది.

జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

దీని ప్రకారం గతంలో 473 అమెరికన్ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుపడు 1,068 డాలర్లకు పెంచింది.

దీనితో పాటు ఇప్పటికే తాత్కాలిక గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాలు వున్నవారు విద్యార్ధి వీసా దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది.

"""/" / వలసలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.ప్రపంచ నలుమూలల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడే వారి సంఖ్యలో పెరుగుదల నమోదు కావడంతో గృహ, మార్కెటింగ్ రంగాలపై తీవ్ర ఒత్తిడి నెలకొందని నిపుణులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్‌ 30తో ముగిసే ఏడాది కాలంలో 5,48,000 మంది దేశంలోకి అక్రమంగా వలస వచ్చారని తెలిపింది.

భారతదేశం విషయానికి వస్తే ఒక్క 2022లోనే 1,00,009 మంది ఆస్ట్రేలియా యూనివర్సిటీలలో చదువుకునేందుకు నమోదు చేసుకున్నారు.

ఈ నిర్ణయం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరి దీనిపై భారత ప్రభుత్వం స్పందించి .విద్యార్ధులకు న్యాయం చేకూరుస్తుందేమో చూడాలి.

పుష్ప 2 సినిమా పేరు చెబితే చాలు బాలీవుడ్ భయపడుతుందా..?