మహా కుంభమేళాకు గ్లోబల్ రేంజ్‌లో ప్రచారం.. ఎన్ఆర్ఐ మహిళపై ప్రశంసలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో( Prayagraj, Uttar Pradesh ) 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది.

భారతీయులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ప్రయాగ్‌‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు.వీరిలో విదేశీయులు కూడా ఉండటం విశేషం.

యాపిల్ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి కూడా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు.జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు.144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ( Narendra Modi )రికార్డు సృష్టించారు.

"""/" / మెల్‌బోర్న్‌కు చెందిన అఘోడి సాధక్ ఆచార్య భావన నాథ్ పూరి( Aghodi Sadhak Acharya Bhavana Nath Puri ).

మహా కుంభోత్సవాల సందర్భంగా దీని విశిష్టత, పవిత్ర స్నానం ప్రాముఖ్యతను ప్రచారం చేశారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా విదేశీయులు, ఎన్ఆర్ఐలు సహా ఎంతో మందిని ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించమని ఆమె ప్రోత్సహించారు.

మెల్‌బోర్న్‌కు చెందిన ఆస్ట్రేలియా జాతీయులు డేవిడ్ జోనాస్, కేథరీన్, సుజోయ్, పాల్‌లు వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ తీర్ధయాత్రకు , అమృత స్నానానికి అవకాశం కల్పించినందుకు గాను భావన పూరికి ధన్యవాదాలు తెలిపారు.

ఆస్ట్రేలియా నుంచి దాదాపు 25 మంది భక్తులకు బస, రవాణా ఏర్పాట్లు చేయడంలో సహకరించిన రాజు శర్మ( Raju Sharma ) నేతృత్వంలోని స్థానిక బ్రాహ్మణ సభ కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలకు పూరీ కృతజ్ఞతలు తెలిపారు.

"""/" / కరంకండి బ్రాహ్మణ విధానాన్ని అవలంబిస్తున్న ఏకైక మహిళ భావన నాథ్ పూరీ.

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హిందూ మతంలోని తత్వశాస్త్రం, బోధనలను ఆమె ప్రచారం చేస్తున్నారు.మహా కుంభమేళాలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి, ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలను సందర్శించే భక్తులలో ఆసక్తిని కలిగించడంలో భావననాథ్ పూరీ విజయం సాధించారు.

ఆమె సేవలను హిందువులు, పలువురు ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు.