టీడీపీలో సీనియ‌ర్ నేత‌ల‌కు మంగ‌ళం.. యూత్ లీడ‌ర్ల‌తో నింపే ప్లాన్..?

ఏ పార్టీలోనైనా సీనియ‌ర్లు ఉండాలి కానీ.వాళ్ల‌తోనే నెట్టుకొస్తే మాత్రం వెన‌క‌బ‌డిపోవాల్సిందే.

సీనియ‌ర్ల సేవ‌లు వినియోగించుకుంటూనే యువ‌నేత‌ల‌కు అవ‌కాశాలిస్తూ పార్టీలో యువ‌ర‌క్తం నింపాలి.ఇప్పుడు ఏపీలోని టీడీపీలో యువ‌ర‌క్తం నింపే ప‌నిలో ఉన్నార‌ట‌.

టీడీపీ వయసు నలభైఏళ్లు.ఆ పార్టీ పుట్టుక నుంచి ఉన్న వారి వయసు సగటున ఆరు పదులు పది దాటి ఉంది.

ఎన్టీఆర్ పార్టీని స్థాపించినపుడు పాతికేళ్ల యువకులు అంతా టీడీపీలో చేరారు.వారే ఇప్పటిదాకా టీడీపీలో ఉంటూ పదవులు అనుభవిస్తున్నారు.

వీరంతా సీనియర్ మోస్ట్ లీడర్లు అయిపోయారు.ఇప్పుడు ఇదే మార్చే ప‌నిలో చిన‌బాబు లోకేష్ ఉన్నారు.

ఇప్ప‌టికే పార్టీలో న‌ల‌భై శాతం యువ నేత‌ల‌కే టికెట్లు ఇస్తామ‌ని లోకేష్ చెప్పిన విష‌యం తెలిసిందే.

యంగ్ బ్ల‌డ్ తో నింపాలని ఇక అధికార పార్టీ వైసీపీలో ఎక్కువ మంది యువకులు కనిపిస్తున్నారు.

జ‌గ‌న్ కూడా యంగ్ లీడ‌ర్ కావ‌డంతో సీన‌య‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి కొత్త త‌రానికి అవ‌కాశాలు ఇచ్చారు.

కానీ టీడీపీ మాత్రం వృద్ధ భారాన్ని మోస్తూ గ‌త ఎన్నిక‌ల్ల ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.

అవుట్ డేటెడ్ పొలిటీషియన్స్ తో జనరేషన్స్ గ్యాప్ తో టీడీపీ సతమతమవుతోంది.ఈ నేప‌థ్యంలోనే టీడీపీ మ‌హానాడు సంద‌ర్భంగా యువ‌త‌కు అవ‌కాశాలిస్తామ‌ని చెప్ప‌గా.

ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు సమాచారం.ఈ నేపథ్యంలో టీడీపీని కూడా యంగ్ బ్లడ్ తో నింపేయాలని నిర్ణయించుకున్నారు.

కనీసంగా నలభై శాతం ఎమ్మెల్యే టికెట్లు ఈసారి యువతకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు.

తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగులో పార్టీ అగ్ర నేత లోకేష్ దీని మీద పలు కీలక సూచనలు చేశారు.

దీని మీద పూర్తి అధ్యయనానికి పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది.

వచ్చే పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికి దీని మీద కమిటీ సమగ్రమైన నివేదిక ఇవ్వనుంది.

ఈ నివేదికను అనుసరించి పార్టీలో కీలక మార్పులు జ‌ర‌గ‌నున్నాయి.నలభై శాతం యువత అంటే కచ్చితంగా 75 మంది వ‌ర‌కు కొత్తవారికి టికెట్లు ఈసారి ఇస్తారు.

దాని కోసం కసరత్తు సాగుతోంది.ఇక రానున్న రోజుల్లో పార్టీ చంద్రబాబు నుంచి లోకేష్ కి సాఫీగా ట్రాన్స్ ఫర్ కావాలంటేయువతరం పార్టీలో ఎక్కువగా ఉంటేనే సాధ్యపడుతుంది అని అంటున్నారు.

"""/"/ మ‌రో నిర్ణ‌యం అలాగే పార్టీలో వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి ఇక టికెట్ ఇవ్వకూడద‌ని నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌.

అదే విధంగా పార్టీ పదవులు ఎవరికైనా రెండు దఫాలే అన్న కొత్త నిబంధనను కూడా అమలు చేయనున్నార‌ట‌.

ఇవన్నీ చూస్తే కనుక కచ్చితంగా టీడీపీ తనను తాను తీర్చిదిద్దుకునే పనిలో పడింది అంటున్నారు.

కాగా లోకేష్ సూచనలతో సీనియర్లలో ఆందోళ‌న మొద‌లైంద‌ని అంటున్నారు.పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ సేవలు ఇక చాల‌ని ఈ ర‌కంగా చెప్తున్నార‌ట‌.

మ‌రి ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తే సీనియ‌ర్లు స‌హ‌క‌రిస్తారో లేదో చూడాలి.అయితే సీనియ‌ర్ల వార‌సులను రంగంలోకి దింపుతార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.