శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఇవే?
TeluguStop.com
తెలుగు మాసాలలో ఐదవ మాసమైన శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది.శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు వ్రతాలు వస్తాయి.
ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో మహిళలు పండుగలు, నోములు చేస్తూ ఎంతో హడావిడిగా కనిపిస్తుంటారు.
మరి శ్రావణ మాసంలో ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
H3 Class=subheader-styleశ్రావణ సోమవారాలు/h3p అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి.ఈ నెలలో వచ్చే సోమవారాలలో భక్తిశ్రద్ధలతో పూజించడం చేత స్వామివారు ప్రీతి చెందుతారు.
పరమేశ్వరుడికి శివరాత్రి తర్వాత ఈ మాసంలో అత్యధిక పూజలు నిర్వహిస్తారు.h3 Class=subheader-styleనాగ పంచమి/h3p శ్రావణ మాసంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భక్తులు ఈ నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 13న జరుపుకుంటున్నారు.
"""/" /
H3 Class=subheader-styleవరలక్ష్మీ వ్రతం/h3pశ్రావణమాసం అంటేనే లక్ష్మీదేవికి ఎన్నో పూజలు వ్రతాలు జరుగుతాయి.
ఈ క్రమంలోనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు.మరి ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీ వరలక్ష్మీ వ్రతం వచ్చింది.
H3 Class=subheader-styleఓనం పండుగ/h3pఇది తెలుగు రాష్ట్రాలలో కన్నా కేరళలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.
ఈ పండుగ ఆగస్టు 21వ తేదీ వచ్చింది. """/" /
రక్షాబంధన్ అన్నా చెల్లెలి ప్రేమకు గుర్తుగా జరుపుకునే పండుగే రక్షాబంధన్.
ఈ రక్షాబంధన్ ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ వచ్చింది.ఈ పండుగ రోజు అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ పై ప్రేమను వ్యక్త పరుస్తారు.
కృష్ణాష్టమి కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు 30న జరుపుకోనున్నారు.కృష్ణాష్టమి వేడుకలను కులమతాలకతీతంగా జరుపుకోవడం విశేషం అని చెప్పవచ్చు.
ఆన్‌లైన్ బెట్టింగ్ పై యువతకు వీసీ సజ్జనార్ హెచ్చరిక