‘టైగర్ నాగేశ్వరరావు’ ఆడియో రైట్స్ సోల్డ్.. భారీ ధరకు సొంతం!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja )నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )''.

ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా బాట పట్టారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మాతలు నిర్మిస్తున్నారు.

"""/" / ఈ సినిమా ఒక వైపు శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుండగా మరో వైపు వరుసగా అన్ని పనులను పూర్తి చేస్తున్నారు.

ఇక నుండి వరుసగా ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కోసం 5 భాషల్లో గ్రాండ్ గా సన్నాహాలు చేస్తున్నారు.

ఐదు భాషల్లో ఐదుగురు స్టార్స్ తో ఈ ఫస్ట్ లుక్ కు వాయిస్ చెప్పిస్తున్నారు.

"""/" / దీంతో ఒకేసారి ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటుంది అని ఇలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఆడియో రైట్స్ గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

టైగర్ ఆడియో రైట్స్ ను భారీ ధరకు సరిగమ( Saregama ) సౌత్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగగా ఈ ఫస్ట్ లుక్ తో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్( G.V.

Prakash ) కుమార్ స్వరాలు అందిస్తుండగా.అనుపమ్ ఖేర్( Anupam Kher ), రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

అందుకే ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచే అవకాశం కనిపిస్తుంది.

ప్రధాని మోడీని కలిసిన ‘ Perplexity AI ’ సీఈవో .. ఎవరీ అరవింద్ శ్రీనివాస్ ?