ఆదిపురుష్ సినిమా థియేటర్ లో హనుమాన్ చైర్ కి పూజలు చేస్తున్న ప్రేక్షకులు…

శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్,( Prabhas ) జానకీ దేవిగా కృతి స‌న‌న్( Kriti Sanon ) న‌టించిన చిత్రం ఆదిపురుష్.

( Adipurush ) టి సిరీస్ బ్యానర్‌పై ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది .రామాయ‌ణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందించారు.

లంకేశ్వ‌రుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టించారు.500 కోట్లకి పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొంది.

నేడు విడుదలయిన ఈ సినిమా ఆ అంచనాలని కొంతవరకు అందుకునేలా ఉందన్న కామెంట్స్ సినిమా చుసిన వారి నుంచి వినిపిస్తున్నాయి .

ఇక్కడే సమయంలో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ధియేటర్స్ లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారు .

దాని గురించి కూడా ప్రత్యేక చర్చ సాగుతుంది .ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న ప్రతీ థియేటర్ లో, ప్రతీ షో కి ఒక సీట్ ను హునుమాన్ కోసం వదిలేయాలని యూనిట్ విడుదలకి ముందే సూచించండి .

"""/" / దీనికి ఆడియన్స్ నుండి కూడా భారీ స్పందన వచ్చింది.ఇక తాజాగా హానుమాన్( Hanuman ) కోసం ఏర్పాటు చేసిన ఒక సీట్ నెట్టింట వైరల్ గా మారింది.

సినిమాలో హల్ లో ఒక సీట్ పై హనుమంతుని రూపం ఉన్న శాలువా కప్పి ఉంది.

ఇది ఆదిపురుష్ సినిమా ప్రదర్శనలో భాగంగా హనుమాన్ కోసం వదిలేసిన సీట్ అంటూ తెగ ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈ ఫోటో కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.అంతేకాదు హనుమంతుని పక్క సీటు కోసం కూడా చాలా డిమాండ్ ఏర్పడింది.

ఇందుకోసం వేళల్లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ‘ఆదిపురుష్‌‘ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు.

ఈనేపథ్యలో ఈ స్పెషల్‌ సీటును ఎలా ఏర్పాటుచేశారన్న ఉత్కంఠ నెలకొంది. """/" / స్పెషల్‌ సీటును కాషాయ వస్త్రంతో కప్పి.

హనుమంతుని చిత్రపటం ఉంచారు.అలాగే జై శ్రీరామ్‌ అంటూ ఆ చైర్‌పై రాసుకొచ్చారు.

అలాగే చాలా థియేటర్లలో హనుమంతుడి సీటును పూలమాలలతో అలంకరించారు.అలాగే థియేటర్లలో అడుగుపెట్టిన అభిమానులు మొదట హనుమంతుడి సీటుకు పూజలు చేసి తమ సీట్లలో ఆసీనులవుతున్నారు.

ప్రస్తుతం ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి సీట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

సినిమా అడినన్న రోజులు ఈ సీటు ఖాళీగా ఉంటుందని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది .విజువల్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్బుతున్నా .

కధనం పై కాస్త శ్రద్ద తీసుకునే ఉంటె బాగుండేది అంటున్నారు .

యూకే ప్రతిపక్షనేత బరిలో భారత సంతతి మహిళా ఎంపీ