హాస్టల్స్ ను తనిఖీ చేసిన ఏటిడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలంలో పలు ప్రభుత్వ వసతి గృహాలను దేవరకొండ ఏటిడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల గిరిజన వసతి గృహం, చలకుర్తి గిరిజన వసతి గృహం,ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం, నాగార్జునసాగర్ నార్తు బీసి బాలుర వసతి గృహాలను సందర్శించి,తరగతి గదులు,భోజన హాలు, వంట గదులను పరిశీలించి విద్యార్థులును వివరాలు అడిగి అందుతున్న మౌలిక వసతులను పర్యవేక్షించారు.

విద్యార్థుల కు వండిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు భోజనం అందించే బాధ్యత వార్డెన్లదేనని పేర్కొన్నారు.విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యనభ్యసించడానికి వస్తున్నారని,అందుకు ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలను వారికి అందజేయాలన్నారు.

భోజనానికి సంబంధించిన రోజువారీ మెనూ సూచిక పాటించాలని సిబ్బందికి సూచించారు.వంటగది పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు.

ఈయన వెంట వార్డెన్లు బాలకృష్ణ,సంధ్యరాణి, రమేష్,సిబ్బంది వున్నారు.

రేపటి నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాల పిలుపు