నా స్థానంలో వేరేవాళ్లుంటే చచ్చిపోయేవాళ్లు.. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర స్టార్, నటుడు ప్రభాకర్( Prabhakar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఎప్పటినుంచో సీరియల్స్ లో అలాగే సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అవడంతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రభాకర్.

ఇకపోతే ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ని( Chandrahass ) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే.

తన కొడుకుని హీరోగా పరిచయం చేసిన కొత్తలో అతనిపై చేసిన ట్రోలింగ్స్ అంతా ఇంతా కాదు.

బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. """/" / ఆ సమయంలో కొడుకుకి అండగా నిలిచి అలా ట్రోలింగ్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ప్రభాకర్.

ఇది ఇలా ఉంటే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్ నగర్ బన్నీ.

( Ram Nagar Bunny ) ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ ఆదివారం రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా చంద్రహాస్‌ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు.ఇది నా తొలి సినిమా.

ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లు అవుతోంది.అప్పుడు నేను యాటిట్యూడ్‌ చూపిస్తున్నాను అని విపరీతంగా ట్రోల్‌ చేశారు.

అందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను.పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను.

కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. """/" / ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను.

ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి.మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.

మా నాన్న బుల్లితెర మెగాస్టార్‌.ఆయనొక డైరెక్టర్‌, యాక్టర్‌, నిర్మాత.

వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్‌ చేశాడు.మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్‌ ఉంటుంది.

నన్ను తిట్టినవారే ఈ రామ్‌ నగర్‌ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను.

తర్వాతి సినిమాకు మరి కొందర్ని పాజిటివ్‌గా మారుస్తాను అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజిటివ్‌గా మార్చేవరకు వదలను.

నాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్‌ సెట్‌ చేసినవాడినవుతాను.

రేపు పొద్దున థియటర్‌లో యాటిట్యూడ్‌ స్టార్‌( Attitude Star ) అన్న టైటిల్‌ పడగానే మీరందరూ అరిచి ఎంకరేజ్‌ చేయాలని కోరుతున్నాను.

నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు.

అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే నాకు అలాంటి ఆలోచనలు రావు.

ట్రోలింగ్‌ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్‌ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు చంద్రహాస్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్12, శనివారం 2024