ఆ పదవులు జగన్ ఎవరికి ఇవ్వబోతున్నారో ? 

వైసీపీలో మళ్లీ పదవుల పందారం మొదలు కాబోతూ ఉండడం తో ఆశావాహులు పెద్ద ఎత్తున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రాబోయే రెండు నెలల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి .

వీటిలో ఒకటి జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి దే.మరో మూడు స్థానాల్లో టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి , టీజీ వెంకటేష్ ది.

అలాగే సురేష్ ప్రభు స్థానం కూడా ఖాళీ కాబోతోంది.ఇవన్నీ ఇప్పుడు వైసీపీ ఖాతాలోనే పడిపోతున్నాయి.

ఇందులో విజయసాయిరెడ్డి స్థానాన్ని జగన్ మళ్లీ రెన్యువల్ చేస్తారు.మిగిలిన మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

జగన్ మాత్రం పదవులలోను సామాజిక వర్గాల లెక్కలు బయటకు తీస్తున్నారట.బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని చూస్తున్నారట.

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో, ఈ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలనేది జగన్ లెక్క గా తెలుస్తోంది.

అయితే ఈ మూడు స్థానాలపై ఎప్పటి నుంచో చాలా మంది వైసీపీ కీలక నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.

"""/" / గతంలో చాలామందికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని హామీ జగన్ ఇచ్చారు.

అలాగే మరికొందరికి ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించినా అందులో కొంతమందికి అవకాశం దక్కలేదు.ఇప్పటికే బీసీ ఎస్సి మైనారిటీలకు ఎమ్మెల్సీ పదవుల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.

వారికి 50 శాతం ఎమ్మెల్సీ స్థానాలను కట్టబెట్టారు.అయినా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని జగన్ చూస్తున్నారట.

దీంతో గతంలో హామీ పొందిన కమ్మ, రెడ్డి సామాజిక వర్గం లోని కీలక నాయకులు కొంతమంది తమకు అవకాశం దక్కుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారట.

రజినీ కాంత్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ లో రజినీకాంత్ పాత్ర ఏంటో తెలుసా..?