తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సచివాలయంలో స్వల్ప ప్రమాదం సంభవించిందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని తెలిపారు.

అగ్ని ప్రమాదంపై గందరగోళ ప్రకటనలు వస్తున్నాయంటూ కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించాల్సిందేనన్న ఆదేశాలతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం జరుపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడానికి ఇది రాచరిక కాలమా అని ఆయన ప్రశ్నించారు.

వారణాసిలో ‘డెత్ హోటల్స్’.. మోక్షాన్ని ఆశిస్తూ వేలాది మంది క్యూ?