Botsa Satyanarayana :మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత

విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కాంగ్రెస్ ( Congress )ఆధ్వర్యంలో బొత్స ఇంటి ముట్టడికి యత్నించారు. """/" / మెగా డీఎస్సీ ( Mega DSC )విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కెనడాలో భారతీయ విద్యార్థుల నిజ స్వరూపం ఇదేనా.. వీడియో వైరల్!