అత్తాపూర్ లో హత్య ఘటనలో ఆ ముగ్గురు యువకుల సాహసం.! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజెన్స్.!

హైదరాబాద్ అత్తాపూర్‌లో నడిరోడ్డు మీద దారుణహత్య జరిగిన సంగతి అందరికి తెలిసిందే.కొందరు దుండుగులు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మీద గొడ్డలితో దాడి చేశారు.

పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 143 దగ్గర ఈ దారుణం జరిగింది.

మొదట నలుగురు వ్యక్తులు రోడ్డుమీద వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి తన్నారు.

అతను కిందపడిపోవడంతో బాధితుడు కిందపడిపోయాడు.దీంతో తమ వెంట తెచ్చిన గొడ్డలితో అతడి మీద విచక్షణారహితంగా దాడి చేశారు.

కింద రక్తపు మడుగులో పడి నిర్జీవంగా ఉన్న వ్యక్తిని ఓ వ్యక్తి గొడ్డలితో నరుకుతూనే ఉన్నాడు.

తనలోని కసి తీరేంత వరకు అలా మెడ మీద కొడుతూనే ఉన్నాడు.ఆ సమయంలో పక్కనే ఉన్న కానిస్టేబుల్ అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు.

కానీ, నిందితుడి చేతిలో గొడ్డలి ఉండడంతో ధైర్యం చేయలేకపోయారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కానీ ఆ హంతకుడిని అడ్డుకున్న ఓ సామాన్యుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నారు.

హత్యను ఆపేందుకు చాలా కష్టపడ్డారు.అతని చేతులు పట్టుకున్నాడు.

దాడి చేస్తున్నా భయపడకుండా ముందడుగు వేశారు.కానిస్టేబుల్ లింగ మూర్తి తో పాటు మరో ముగ్గురు యువకులపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసలు ఆ ముగ్గురు యువకులు ఎవరంటే.? ఉదయం 11.

20 గంటలకు దాడి ప్రక్రియ ప్రారంభం కాగా.రెండున్నర నిమిషాల్లో పని పూర్తయ్యింది.

ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి రమేశ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమే.

తొలుత కళ్లద్దాలు ధరించిన వ్యక్తి ముందుకు వచ్చి రెండు దఫాలుగా వెనుక నుంచి ఓ నిందితుడిని గట్టిగా పట్టుకొని దాడిని అడ్డుకునేందుకు యత్నిస్తూనే తనను తాను రక్షించుకున్నాడు.

మరో యువకుడు కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ మొదటి వ్యక్తి తప్పుకోగానే సీన్‌లో ఎంటర్‌ అయి తప్పించే ప్రయత్నం చేశాడు.

ఇది సాగుతుండగానే బ్లాక్‌ షర్టు వేసుకున్న మరో యువకుడు వెనుక నుంచి గట్టిగా తన్నడంతో మహేశ్‌గౌడ్‌ కింద పడ్డాడు.

ఆ ముగ్గురిలో బ్లాక్‌ షర్ట్‌ ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.ఆటోలో నుంచి దిగి తన్నడంతో ఆటోకు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది.

నేను సంపాదించిన ఆస్తులు నాకు సుఖాన్ని ఇవ్వలేదు : నటి జయసుధ