ఏసీబీ అధికారుల దాడులు.. పట్టుబడ్డ వ్యవసాయ విస్తరణ అధికారి

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా జూలూరు పాడు మండల పాపకొల్లు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గా పనిచేస్తున్న బెజవాడ మణికంఠ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

పాపకొల్లు గ్రామం లోని రైతు వేదికలో ఒక గిరిజన రైతు నుండి 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

ఏకకాలంలో కొత్తగూడెం మండలం సుజాత నగర్ లోని మణికంఠ నివాసం ఉంటున్న గదిలో, అదే విధంగా మణికంఠ స్వగ్రామం అశ్వరావుపేట లో దాడులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

చొక్కాలను చింపుకొని మరీ బాదుకున్న వ్యాపారస్తులు… దేనికోసం అంటే?