విశాఖ సౌత్ లో వైసీపీ కార్పొరేటర్లపై వేటు..!!
TeluguStop.com
విశాఖ సౌత్ లో కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.ఈ మేరకు నలుగురు కార్పొరేటర్లను సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ సౌత్ లోని 29, 31, 35, 37 వ వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి వ్యతిరేకంగా సీతంరాజు సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నలుగురు కార్పొరేటర్లపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది.కాగా వాసుపల్లికి టికెట్ దక్కడంతో వైసీపీకి వ్యతిరేకంగా సీతంరాజు సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం.
మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే సూపర్ లడ్డూ ఇది.. రోజూ తింటే లాభాలే లాభాలు!