హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య..!
TeluguStop.com
హైదరాబాదులో( Hyderabad ) సోమవారం అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి( Real Estate Trader ) గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ సాదిక్ ఆలీ ఖాద్రి( Mahammed Sadik Ali Khadri ) అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది.
మహమ్మద్ సాదిక్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి.సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత మహమ్మద్ సాదిక్ తన ఇంటి ముందు ఉన్న అరుగుపై కూర్చున్న కాసేపటి తర్వాత కొంతమంది గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి వచ్చారు.
"""/" /
మహమ్మద్ సాదిక్ వారిని చూసి ఎవరో అనుకున్నాడు కానీ తనపై దాడి చేసేందుకు వచ్చారని తెలుసుకోలేకపోయాడు.
దుండగులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన కారు అడ్డుగా ఉండడంతో తప్పించుకోలేకపోయాడు.
దుండగులు తమతో పాటు తీసుకువచ్చిన వేట కొడవళ్లతో మహమ్మద్ సాదిక్ పై విచక్షణారహితంగా దాడి చేశారు.
మహమ్మద్ సాదిక్ గట్టిగా అరిచిన అర్ధరాత్రి కావడంతో ఎవరు ఆ అరుపులను పట్టించుకోలేదు.
"""/" /
మహమ్మద్ సాదిక్ మృతి చెందిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే బయటకు వెళ్లిన మహమ్మద్ సాదిక్ ఎంతసేపటికి లోపలికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూస్తే నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగత జీవిల పడి ఉన్నాడు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మనోహర్ తో( DCP Manohar ) పాటు చంద్రయానగుట్ట ఏసీపీ సంఘటన స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి( Osmania Hospital ) తరలించారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతాలలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంట్‌లో తప్పుడు సాక్ష్యం .. సింగపూర్‌లో దోషిగా తేలిన భారత సంతతి నేత