న్యూస్ క్లిక్ పై దాడి పత్రికా స్వేచ్ఛను హరించడమే: జూలకంటి

సూర్యాపేట జిల్లా:ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ కార్యాలయంపై పోలీసులు దాడి చెయ్యడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వ్యక్తులపైన,సంఘాలపై, మీడియాపై,మేధావులపై, సంస్థలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్ క్లిక్ కార్యాలయం పైన సిబ్బంది ఇండ్లపైన సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసం పైన ఎలాంటి పర్మిషన్ లేకుండా దాడులు నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

ఉగ్రవాద నిరోధక చట్టం కింద న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్,పోర్టల్ హెచ్ఆర్ విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకి సంక్షేమ పథకాలు అక్రమంగా దోచిపెడుతున్నారని విమర్శించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

గత నెల రోజులుగా అంగన్వాడి, ఆశ,మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక వర్గంతో చర్చలు జరిపి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దిరావత్ రవి నాయక్,బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మట్టిపల్లి సైదులు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి,జిల్లపల్లి నరసింహారావు,కొప్పుల రజిత,దేవరం వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ,కందాల శంకర్ రెడ్డి,పులుసు సత్యం,కోదమగుండ నగేష్,మేకనబోయిన శేఖర్,పల్లె వెంకట్ రెడ్డి, దుర్గి బ్రహ్మం,షేక్ యాకూబ్,మిట్టగడుపుల ముత్యాలు,వట్టెపు సైదులు,చిన్నపంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రేవతి కుటుంబానికి అండగా వేణుస్వామి.. ఈ ఒక్క విషయంలో మెచ్చుకోవాల్సిందే!