జీవితా రాజశేఖర్ పై దాడి.. నాపై లైంగిక ఆరోపణలు చేపించాడు.. బన్నీవాసుపై విరుచుకుపడ్డ కత్తి మహేష్!
TeluguStop.com
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్.మొదట్లో షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత ఓ సినిమాకి సహాయ రచయితగా చేశాడు.ఇక సినీ నటుల పట్ల ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాడు.
ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసిన కత్తి మహేష్ తాజాగా బన్నీ వాసు పై కొన్ని విషయాలలో విరుచుకుపడ్డాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయాన్ని బయట పెడుతుంటాడు.
గతంలో పవన్ కళ్యాణ్ పట్ల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా బన్నీ వాసు బర్త్ డే సందర్భంగా కత్తి మహేష్ కొన్ని సంచలన పోస్ట్ పెట్టగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన ఫేస్ బుక్ వేదికగా.అప్పట్లో ప్రజారాజ్యం సమయంలో హీరో జీవిత రాజశేఖర్ దంపతుల మీద దాడి చేయించింది.
జనసేన హయాంలో తన మీద ఒక మహిళతో తప్పుడు ప్రచారం చేయించింది ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గారని తెలిసింది అంటూ.
అందులో ఎంత నిజముందో వారి మనస్సాక్షికే తెలియాలి అంటూ వారికి నా అభినందనలు.
ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు.చాలా ఏళ్ళ కిందట జరిగిన ఈ ఘటన గురించి పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి రాజకీయ అనుభవం లేదని జీవిత రాజశేఖర్ లు తీవ్రంగా విమర్శించగా.
దీనిపై చిరంజీవి అభిమానులు వారు కారులో ప్రయాణిస్తున్న సమయంలో వారిపై దాడి చేశారు.
దీంతో జీవిత రాజశేఖర్ కేసు పెట్టగా దాడి చేసిన వ్యక్తులను గుర్తుపట్టలేక పోతున్నామని మళ్లీ కేసును వాపస్ తీసుకున్నారు.
"""/"/
ఇక కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో కత్తి మహేష్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్నాడు.
సునీత బోయ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అక్కడే ఉండగా.కత్తి మహేష్ తనపై లైంగిక ఆరోపణలు చేశాడని తెలిపింది.
అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ రెండు ఇష్యూలో బన్నీ వాసు హస్తం ఉందంటూ పోస్టు పెట్టాడు కత్తి మహేష్.
వైరల్: పాము, ముంగీస ఫైటింగ్ చూడండి… అరాచకం అంతే!