గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ నేత పై దాడి
TeluguStop.com
పరసా రంగనాధ్ కు బిసి మహిళాల చేతుల్లో చెప్పు దెబ్బలువెనకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి పేరుతో బీసీ మహిళాలను ఆర్దికంగా అరగించేశాడు.
డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా తప్పుడు ప్రచారం.చంపుతానని బెదిరింపులు, భయపడి బయటకు రాని బాధితులు ఎందరో?మాయమాటలు నేర్పుగా చెప్పి, లక్షల్లో ఆర్దికసాయం తీసుకోవటం కుదిరితే బలహీనత ఆసరా చేసుకుని లోబర్చుకోవటం .
లోబడని వారిని లోబడినట్లుగా ప్రచారం చేసుకోవటంతో చిర్రెత్తిన మహిళాలు ఆవేదన, ఆక్రోషంతో శివతాండవం రూపంలో విడతాల వారిగా రంగనాధ్ కు దేహశుద్ది చేసిన ఉద్దంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంగళగిరి పట్టణానికి చెందిన పరసా రంగనాధ్ జిల్లా బీసి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఉన్న సమయంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం పేరుతో మంగళగిరి నియోజకవర్గంలోని బీసి మహిళాలను ఆర్దికంగా మోసగించినట్లు సమాచారం.
దీంతో జిల్లా బాధ్యతల నుండి ఇటీవల రంగనాధ్ ను తొలగించారు.బీసీ మహిళాలను వేధించటం, అవసరం కోసం చెబదులుగా తీసుకున్న లక్షలాది రూపాయాలు తిరిగి ఇవ్వాలని కోరితే , అడ్డం తిరగటం, బెదిరించటం, వారిపై రంగనాధ్ తప్పుడు ప్రచారం చేస్తున్నడనే ఆరోపణాలతో బాధిత మహిళాలు పోలీసులను అశ్రయించిన వైనం.
తనను మానసికంగా వేధిస్తూ , బెదిరింపులకు పాల్పాడుతున్నాడని ఓ మహిళా ఫిర్యాదుతో పరసా రంగనాధ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నెం 216/2022 .
2022 కేసు నమోదు అయింది.తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా, మానసికంగా వేధిస్తూ, బెదరింపులకు పాల్పడుతున్నాడని ఓ బీసి మహిళా ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నెం 145/2022 .
2022 న కేసు నమోదు అయింది.ఓ మహిళతో ఉన్న పరిచయం తో ఇంటికి వెళ్లిన బీసి నేతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కుటుంబీకులు , బీసీ సంఘ మహిళాలు దేహశుద్ది కార్యక్రమం నిర్వహించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సంఘ నాయకునిగా చలామాణీ ఆవుతూ వ్యక్తిగతంగా చాలా మంది వద్ద లక్షలల్లో తీసుకుని, ఇవ్వనని అడ్డం తిరిగి బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేస్తున్నాడనే ఆరోపణాలు వినిపిస్తున్నాయి.
చీటీల బాధితులు, ఆర్దికంగా మోసపోయిన బీసీ మహిళాలు, సంఘ పెద్దలు, నిరుద్యోగులు ఒక్కోక్కరూ వెలుగులోకి రావటమే తరువాయి.
కుల సంఘాల పేరుతో ఆర్దిక మోసాలకు పాల్పాడుతున్న వైట్ కాలర్ నేరగాళ్ల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించాలసిన పరిస్దితులు నెలకొన్నాయి.
కుల సంఘాల ముసుగులో ఆర్దిక, నేరాలకు పాల్పాడే వారిపై రౌడీ షీట్ తెరచి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది.